O Maghuva (From "Janata Bar")

ఇది మొదటి సారి కాదు
ఇంతటితో ముగిసిపోదు
పడి లేవకుంటే
పరుగన్న మాట
పుట్టేది అసలు కాదు
తల ఎత్తి పైకి చూడు
తల వంచనోడు లేడు
తల దించుకోక పోరాడినోడు ఏనాడు ఓడిపోడు

ఓ మగువ నువ్వు
పోరాడటమే ఈ జగతికి నేర్పించావులే
ఓ మగువ నువ్వు
తలుచుకుంటే కానిది ఏదీ లేదులే

పురుడు పోసి పెంచావు ఈ ప్రపంచమంతా
అయినా నువ్వు ఒంటరివే అనాదిగా వింత
పడక గదుల పడమరలో
అస్తమించే నీ హృదయం
ప్రతి మగాడి కళ్ళల్లో
చితికిపోయే నీ పరువం
పడమరలో ఆరిపోదు పుటుక వెలుగు లక్షణం
దరి లేదని ఆగిపోక దారి వెతుకు తక్షణం

ఓ మగువ నువ్వు
పోరాడటమే ఈ జగతికి నేర్పించావులే
ఓ మగువ నువ్వు
తలుచుకుంటే కానిది ఏదీ లేదులే

సడిలేని కడలికుంది ఉప్పెనంత కోపం
అది విరుచుకుపడిన వేళ ఉండదు ఏ పాపం
అల్లారు ముద్దుగా పెనవేసుకున్న పాశం
అణిచేసిన పశువులకు అశు దండన పాఠం
నీరుగారి పోనీకు నీలోని ధైర్యం
నీరసించి పోయాకే పుడుతుంది కొత్త స్థైర్యం

ఓ మగువ నువ్వు
పోరాడటమే ఈ జగతికి నేర్పించావులే
ఓ మగువ నువ్వు
తలుచుకుంటే కానిది ఏదీ లేదులే



Credits
Writer(s): Kalyan Chakravarthy, Vinod Yajamanya
Lyrics powered by www.musixmatch.com

Link