Eruvaka Sagalantey (From "Eruvaka Sagalantey")

పిల్లా తెల్లారు జామున లేచి
తొందర తొందర స్నానము చేసి
త్వరత్వరగా నువు పూజలు చేసి
ముస్తాబయ్యావే
ఇంటి ముందులో కళ్యాపేసి
ఇరుకు సందులో ముగ్గులు వేసి
ఎందుకు తినాలి అనుకుంటూ
నువు పస్తులు వున్నావే
చుట్టూ ఉన్నా స్నేహితురాళ్లు
వయసుకు వచ్చిన నీ చెల్లెళ్లు
ఇద్దరు పిల్లల తల్లులు అయ్యి
హాయిగ ఉన్నారే
ఎందుకు ఎందుకు పరిగెడతావో
ఏమోస్తుందని ఆశిస్తావో
జీవితమంతా ఇంట్లో ఉంటే
ఎప్పుడు ప్రేమిస్తావో
అందుకే ఎరువాకా సాగాలంటూ
ఎక్కడికెళతావమ్మాడి
పూత రేకులు మాడతా పెట్టి
నోట్లో పెడతా గుమ్మాడి

ఏరువాకా సాగాలంటూ
ఎక్కడికెళతావమ్మాడి
పూత రేకులు మాడతా పెట్టి
నోట్లో పెడతా గుమ్మాడి
రోజూ రోజూ నీచుట్టూ
బొంగరమల్లే తిరిగానే
ఫోజూ కొట్టి
నన్నే వదిలేసెళ్లావనుకున్నానే
రాజు రాణి నేను నువ్వని
ఊహల్లో అనుకున్నానే
గాజుల మీద నడిచే
నీ బ్రతుకని నే మరిచానే
రావమ్మా రా అంటూ
నీ బాధ్యతలన్నీ నావంటూ
నా ప్రాణం కన్నా మిన్నగ
నిన్ను చూసుకుంటానే
జో అమ్మా జోజో అంటూ
లాలి పాటలు నే పాడే
నీ అలసట తీరే దాకా
నేను సరసన ఉంటానే

అందుకే ఎరువాకా సాగాలంటూ
ఎక్కడికెళతావమ్మాడి
పూత రేకులు మాడతా పెట్టి
నోట్లో పెడతా గుమ్మాడి
ఏరువాకా సాగాలంటూ
ఎక్కడికెళతావమ్మాడి
పూత రేకులు మాడతా పెట్టి
నోట్లో పెడతా గుమ్మాడి



Credits
Writer(s): Pavan Cherukumilli
Lyrics powered by www.musixmatch.com

Link