Ne Kothaga

నాకు నే కొత్తగా తోచెను
ఈ మాయ నీదే కదా
ఆశ ఆరాటమై
నీవే నా సొంతమయ్యేంతగా
నిన్ను సరిపోదుగా
నీ పై ప్రేమ పూచేందుకు
ఈ క్షణాలే ఇక
నాలో నేనిక నువ్వవ్వగా
ఒక ఊహే ఊసులాడుతూ నీతో
నన్నే పెనవేసేలే
నీ మాటే
విన్న వెంటనే నాలో
ఏదో ఉల్లాసమే
రేకెత్తించే వయస్సిలా
ఉప్పొంగిందే వరసలా
కవిస్తున్నా తపనలే
ముంచెత్తేనా తరమగా

నీ చూపే గుండెనే
చిరు చినుకై తాకగా
పులకించే మనసిలా
నా కలలే కళ్లతో
కనుసైగ చెయ్యగా
ఈ కాలం ఆగునా
నీతో నేనే ఉంటుంటే
మబ్బుల్లో తేలుతున్నా
సంతోషం నాకు సొంతమంటా
నువ్ నన్ను చూస్తూ ఉంటే
కనురెప్పే వాల్చలేక
తబ్బిబైపోతున్న ఈ వేళ
నీ కోసం మనసు వింతగా పరితపించెగా
నా మనసే నీకు నేరుగా
రాసిచ్చేందుకు కొత్తగా

రేకెత్తించే వయస్సిలా
ఉప్పొంగిందే వరసలా
కవిస్తున్నా తపనలే
ముంచెత్తేనా తరమగా



Credits
Writer(s): Ms Rudra Kiran, Sudheshna Mokkapati, Anirudh Sandilya
Lyrics powered by www.musixmatch.com

Link