Praanale (From "Ravikula Raghurama")

రాలిపోయే పువ్వులకే
రంగులేయక కదిలావా
రేయి మొత్తం కరిగాక
వెన్నెలేదని వెతికావా
మబ్బులే చెల్లాచెదురయ్యాక
వాన చినుకుల కోసం నింగిని చూశావా

ప్రాణాలే ప్రాణాలే
పువ్వుల్లా నీ పాదం ముందే
పరిచాడే అడుగడుగు రవికుల రఘురామ
ఊపిరి పై ఊపిరి పై
నీ పేరుని పచ్చాబొట్టేసి
బ్రతికాడే అనుదినము రవికుల రఘురామ
బ్రతికాడే అనుదినము రవికుల రఘురామ
నీ గుండెనే తుడిచేసినా
నీ ప్రేమనే అందించినా
అది అందుకునే దగ్గరలో తానున్నాడా
నీ కన్నీటికి కదిలోచ్చి బదులిస్తాడా
కనువిప్పే కలిగే లోపే ఈ కధ ముగిసిందా

ఊపిరి పై ఊపిరి పై
నీ పేరుని పచ్చాబొట్టేసి
బ్రతికాడే అనుదినము రవికుల రఘురామ
బ్రతికాడే అనుదినము రవికుల రఘురామ
రాలిపోయే పువ్వులకే
రంగులేయక కదిలావా
రేయి మొత్తం కరిగాక
వెన్నెలేదని వెతికావా
మబ్బులే చెల్లాచెదురయ్యాక
వాన చినుకుల కోసం నింగిని చూశావా

గాయం చేసిన గతమే
మోడుగా కనిపిస్తున్నది
దానికి మళ్లీ వాడిన ప్రేమే చిగురిస్తున్నది
పై వాడే ఓ పిచ్చి రాతలు రాసేస్తాడట
పైగా జరిగిందంతా చూస్తూ నవ్వేస్తాడట
రాతలు మరిచి గీతలు విడిచి
కథ ఇక నువ్వే మార్చాలి
ప్రేమకు ప్రాణం పోయాలి
వాలేటి వాలేటి
సూరీడల్లే సెలవని అన్నా
మళ్లీ ఉదయిస్తాడే తన ప్రతి రూపంగా
లాలీజో లాలీజో
అంటూ నువ్వాడే జోలాలీ
వినడానికి వస్తాడే నీ ఒడికి మరలా
మొదలవుతుందే తన కధ
మళ్లీ నీ వల్ల

తన ప్రేమకే బహుమానమే
అవుతుందిలే నీ త్యాగమే
నీ పొరపాటుని సరిదిద్దే అవకాశంలా
ఏ ఆడది చేయని సాహసం అనిపించేలా
నువ్వేసే ఈ అడుగే చరితల్లె మారునుగా



Credits
Writer(s): Sukumar Pammi, Karuna Kumar Adigarla
Lyrics powered by www.musixmatch.com

Link