Vayyari Godari

వయ్యారి గోదారి నువ్వే
నా దారికే వచ్చి చేరావులే
నా వెంట నువు నడిచి రావే
నూరేల్లుంట నీడల్లే
తెల్లారి సూరీడు నేనై
నీ అలల పై తేలుతున్నానులే
జన్మంతా ఈ జ్ఞాపకాలే
మోస్తూనే ఉంటారులే
కాలమంత కాస్త ఆగిపోతే
ఎంత బాగుంటుందే నిజంగా
నాతో పాటు నువ్వున్నందుకే
ఈ చోటుందే ఇంతందంగా
నిన్నే చూస్తూ ఈ ప్రాణమే
పోతే పోనీ
పిల్లా నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా
పిల్లా ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా
పిల్లా చంటి పిల్లోడిలాగ చిందేస్తున్నా
పిల్లా జంట గువ్వల్లే గూటికి ఎగిరోస్తున్నా

చందమామే చెంతనుంటే
మినుగురులే దేనికింక నా దారిలో
కళ్ల ముందే కలలు ఉంటే
నిద్దురలే ఎందుకంట రాతిరేలలో
గిర గిర గిర ఊహలన్నీ
నీ వైపు సాగగా
గడిచినదే రోజు చిన్న గడియలా
ముడి పడదని నీకు నాకు
అన్నాము ఎప్పుడో
కలిసే ఉన్నాముగా

పిల్లా నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా
పిల్లా ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా
పిల్లా చంటి పిల్లోడిలాగ చిందేస్తున్నా
పిల్లా జంట గువ్వల్లే గూటికి ఎగిరోస్తున్నా

మేఘమల్లె తేలిపోతూ
నిలకడగా ఉండదే నీ తీరు
ఎదుట ఉంటూ ఎదురు చూస్తూ
నీరందని నేలనై నేనున్నాను
చిటపటమని ఓ చినుకులా నువ్వు కరగవా
చిగురులనే తొడుగుతాను ప్రేమగా
పదపదమని తూనీగలా నన్ను చేరవా
నా లోకం నీవుగా

పిల్లా నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా
పిల్లా ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా
పిల్లా చంటి పిల్లోడిలాగ చిందేస్తున్నా
పిల్లా జంట గువ్వలే గూటికి ఎగిరోస్తున్నా



Credits
Writer(s): Kasarla Shyam, Rr Dhruvan
Lyrics powered by www.musixmatch.com

Link