Nanuganna (From "Sri Ramulayya")

నను గన్న నా తల్లి రాయలసీమ, రతనాల సీమ
తనువెల్లా తరుగని ఘనులున్న సీమ, గిరులున్న సీమ
నను గన్న నా తల్లి రాయలసీమ, రతనాల సీమ
తనువెల్లా తరుగని ఘనులున్న సీమ, గిరులున్న సీమ

వానగాలికి సీమ తానమాడినపుడు వజ్రాలు ఈ నేల ఒంటిపై తేలాడు

పొరలు నిమిరితే పుష్య రాగాలు దొర్లు రాగాలు దొర్లు
బంగారు ఘనులున్నా కుంగదీ తల్లి పొంగిపోదమ్మా

కలియుగంబున నరులు ఓర్వలేరని తెలిసి నల్ల రాయై వెలసి ఎల్లలోకమునేలు

వెంకటాచలము భూవైకుంఠ స్థలము వైకుంఠ స్థలము
దర్శించినా జన్మ ధన్యమౌతాదో పుణ్యమౌతాదో
నను గన్న నా తల్లి రాయలసీమ, రతనాల సీమ
తనువెల్లా తరుగని ఘనులున్న సీమ, గిరులున్న సీమ

హరిహరభుక్తరాయ అడివి వేటాకెళితే కుందేళ్లు కుక్కల ఎంటబడ్డాయంట

పౌరుషాల పురిటి జీవగడ్డమ్మో జీవగడ్డమ్మో
ప్రతినబట్టిన శత్రువిక పతనమేరా ఇక పతనమేరా

పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ ఆది గురువుల తపము నాచరించెను బిలము
హటకేశ్వరా శిఖరమవని కైలాసం అవని కైలాసం
తనుకుతానెలసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మో
నను గన్న నా తల్లి రాయలసీమ, రతనాల సీమ
తనువెల్లా తరుగని ఘనులున్న సీమ, గిరులున్న సీమ

సత్రాలు సాధువులు భైరాగి తత్వాలు
సీమ ఊరూరున మారు మ్రోగుతాయి
శిథిలమైన గుళ్ళు శివనందులమ్మో శివనందులమ్మో
వీరబ్రహ్మం ముఠము సీమకే మకుటం సీమకే మకుటం

పాలబుగ్గల నోట వేణువు మీటితే ఆలమందలు కంచె బీళ్ళు పరవశించు
నింగిలో సంద్రుడు తొంగిసూసితే తొంగిసూసితే
సీమలో కోలాటమే సిందుతొక్కు చిరుగజ్జలాడు

నను గన్న నా తల్లి రాయలసీమ, రతనాల సీమ
తనువెల్లా తరుగని ఘనులున్న సీమ, గిరులున్న సీమ

ఎత్తు బండరాళ్ళు, ఎర్రని దుప్పులు, పనుగు రాళ్ళ గట్లు, పరికి కంపపొదలు

నెర్రెళ్ళు వారిన నల్లరేగళ్ళు నల్లరేగళ్ళు
ఆరు తడుపుకు పెరిగే వేరుశెనగమ్మో వేరుశెనగమ్మో

నల్లమల్లడవుల్లో తెల్లబారే పొద్దు అంబకేళకి సీమ మీదగ్గి కురిపించు
సందె పూట నుండి కొండ నీడల్లో కొండ నీడల్లో
చల్లగాలికి ఒళ్ళు మరచి నిదురించు అలసి నిదురించు
నను గన్న నా తల్లి రాయలసీమ, రతనాల సీమ
తనువెల్లా తరుగని ఘనులున్న సీమ, గిరులున్న సీమ
నను గన్న నా తల్లి రాయలసీమ, రతనాల సీమ
తనువెల్లా తరుగని ఘనులున్న సీమ, గిరులున్న సీమ



Credits
Writer(s): Vandematharam Srinivas, Goreti Venkanna
Lyrics powered by www.musixmatch.com

Link