Muddha Banthi Puvvulaa

ముద్ద బంతి పువ్వులాలా
నవ్వుతుంటే వెన్నెలే ఇలా
కాటుకున్న కళ్లతోవలా
విసిరావే నాపైనిలా
రంగులద్దుకున్న విల్లులా
వాలు చూపులోకే వాలిలా
ఊయలూగినట్టు నన్నిలా
చేసావే నువ్వే ఎలా

ఓ నీటిలోని తామరాకుపై ఎలా
చినుకురాలే సంబరాలెలా
అద్దమంటి మెరుపు మోముపై ఇలా
మురిసిపోయే ముత్యమంతలా
ఆరో ఆరారో ఆరో ఆరారో
ఆరో ఆరారో రే
ఆరో ఆరారో ఆరో ఆరారో
ఆరో ఆరారో రే

ఓ రవ్వల పట్టి నవ్వుల కుట్టి
పట్టేసావే బొమ్మల బుట్టి
నెట్టేసావే నన్నే పట్టి
కన్నే కొట్టి దండం పెట్టి
ప్రేమాయణమే బట్టీ పట్టి
ప్రేమిస్తున్నా ముద్దే పెట్టి
ఇద్ది ముల్లే గుచ్చిందాయిగా
తేనె జల్లే కురిసిందిలా
రేగి పళ్లే పులుపంత తియ్యగా
ఉన్నదిలే ఎందుకిలా
ఓ మొదటిసారి మట్టి పైన రాయిలా
చినుకులోనే పులకరింతనీ
పాల మీగడంటి సొట్ట బుగ్గల పైన
చిన్న మొటిమ నేనే అవ్వనీ

ఆరో ఆరారో ఆరో ఆరారో
ఆరో ఆరారో రే
ఆరో ఆరారో ఆరో ఆరారో
ఆరో ఆరారో రే



Credits
Writer(s): Ml Raja
Lyrics powered by www.musixmatch.com

Link