Ella (From "Lakshmi Kataksham")

ఇలా కళ్లారా నన్నే చూస్తూ
ఉంటే ఎలా
కను రెప్పే మూతలు వేసేది
అలా అందంగా నువ్వే నవ్వేస్తుంటే
ఎలా కుదురైనా ఉండేది
అల్లాడి పోతుందే నా ఊపిరంతా
నీ వాలు చూపుల్లోనే
ఇరుక్కు ఇరుక్కు ఇరుక్కు పోయి
దారి లేదంటూ నా ప్రాణమంతా
నీ వేడి ఊహాల్లోనే
అటు ఇటు తిరుగుతు
పొందెను హాయి

ఇలా కళ్లారా నన్నే చూస్తూ
ఉంటే ఎలా
కను రెప్పే మూతలు వేసేది
మిణుగురు మెరుపులా
నువ్వు అటు ఇటు తిరిగితే
మతి చెడి తెలియదే
నా ఒంటి మీద తేలు పడినా
చిట పట చినుకులా
నువ్ తనువుని తడిమితే
రక రక రకముల
సెగ మంటలోకి జారి పడనా
కలకు చెలిమిగ కితకితలెడితే
మెలుకువ అడగని నిదరవనా
తెలియని తమకము
కనులకు పులిమి పులకించనా
ఎదురుగ నిలబడి నువు జత కడితే
కలలిక అడగని నిజమవనా
అడుగడుగడుగున పూవులు పరిచి పూజించనా

ఇలా కళ్లారా నన్నే చూస్తూ
ఉంటే ఎలా
కను రెప్పే మూతలు వేసేది
ఉదయము తెలియదే
నడి రాతిరి తెలియదే
మరి మరి చనువుగా
నువు ప్రేమతోటి నన్ను తడితే
ఎన్నెల తెలియదే
పొగ మంచని కూడ తెలియదే
మనసుని అంతలా ముసురేసుకుంటూ
ముద్దు పెడితే
ఇది వరకెరుగని సరిగమపలు
పెదవుల చివరన పలికెనుగా
ఇది అని తెలియని
పరవశమేదో ముంచెత్తగా
ఒకటిగ ముడి పడి కలసిన ఎదలు
సులువుగ విడ విడ జరగదుగా
ఋజువుగ మన జత
ఎదురుగ పెడతాం సరికొత్తగా

ఇలా కళ్లారా నన్నే చూస్తూ
ఉంటే ఎలా
కను రెప్పే మూతలు వేసేది



Credits
Writer(s): Suresh Banisetti, Abhishek Rufus
Lyrics powered by www.musixmatch.com

Link