Sooseki (From "Pushpa 2 The Rule") [TELUGU]

వీడు మొరటోడు
అని వాళ్లు వీళ్లు
ఎన్నెన్ని అన్న
పసిపిల్ల వాడు నా వాడు
వీడు మొండోడు
అని ఊరువాడ అనుకున్నగాని
మహరాజు నాకు నా వాడు
ఓ మాట పెళుసైనా
మనుసులో వెన్నా
రాయిలా ఉన్నవాడి లోన
దేవుడెవరికి తెలుసును నాకన్న
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి
(ధిన్ తాంకిడి తాంకిడి ధిన్నా)
(ధిన్ తాంకిడి తాంకిడి ధిన్నా)

ఓ ఎర్రబడ్డ కళ్లలోనా
కోపమే మీకు తెలుసు
కళ్లలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు
కోర మీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు
అడవిలో పులిలా సర సర సర సర
చెలరేగడమే మీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి
(ధిన్ తాంకిడి తాంకిడి ధిన్నా)
(ధిన్ తాంకిడి తాంకిడి ధిన్నా)

ఓ గొప్ప గొప్ప ఇనాములనే
ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం
చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు
పెద్ద పెద్ద పనులు ఇట్టే
చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో
వెతకమంటాడు చూడు
బయటకు వెళ్లి ఎందరెందరినో
ఎదిరించేటి దొరగారు
నేనే తనకీ ఎదురెళ్లకుండా
బయటకు వెళ్లరు శ్రీవారు

సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
ఇట్టాంటి మంచి మొగడుంటే
ఏ పిల్లయినా మహరాణి



Credits
Writer(s): G Devi Sri Prasad, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link