Welcome to My Zindagi

ఏ రోజైతే నిన్ను చూసిందో నా కన్ను
ఆ రోజే నచ్చేసింది
నా బుజ్జి మనసెమో వెనువెంటనే
నిన్ను తనలోన దాచేసింది
ఎవ్వరే నిను ఎవ్వరే పంపినారిలా
నిండుగా నీ వల్లనే నిజము నా కలా

(Welcome to my जिंदगी)
(స్వాగతం చెలీ)
(వేయి జన్మలూ ఇలా)
(తోడై నువ్వే రావాలి)
మల్లెల పిడుగై మనసుని కుదిపేసావే
పరిమళ వర్షం కురిసావే (కురిసావే)
రంగుల వెలుగై కనులను ముసిరేసావే
బ్రతుకున సగమై మెరిసావే (మెరిసావే)
వెన్నెలైన వేసవే నీవు లేనిదే
నీవు లేని జీవితం ఊన్నా లేనిదే

(Welcome to my जिंदगी)
(స్వాగతం చెలీ)
(వేయి జన్మలూ ఇలా)
(తోడై నువ్వే రావాలి)
నిలువదు మనసు నిను విడి
నిలువదు మనసు
నిమిషము కూడా దూరంగా (దూరంగా)
తెలియదు అసలు
మరియొక లోకము తనకు
ప్రతియొక తలపు నీదేగా (నీదేగా)
కనుల కలల కాంతిగా
ఎపుడూ నీవేలే
ఎదను తాజు మహలుగా మార్చినావులే

(Welcome to my जिंदगी)
(స్వాగతం చెలీ)
(వేయి జన్మలూ ఇలా)
(తోడై నువ్వే రావాలి)



Credits
Writer(s): Saraswati Putra Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link