Istam Official Remix

చిన్నప్పుడు నాకు
అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్తెదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం
బళ్ళోకెళ్ళే వేళ రెండు జల్లు
అంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులెట్టడం ఇష్టం
కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువు పడే కష్టం
తెల్లారంగానే వెచ్చనైన coffee ఇష్టం
ఉల్లాసం పెంచే స్వచ్చమైన soap-eh ఇష్టం
అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం ఆహా ఓహో
అంటే ఇష్టం
గొడుగులేని వేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదర రాని వేళ జోల పాట ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువు పడే కష్టం
రెప్పల తలుపు మూసి
కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకు పోయే
కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే
చిలిపి అల్లరంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే
కొత్త కబురులంటే ఇష్టం
ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువు పడే కష్టం



Credits
Writer(s): Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link