Manaki Manaki (From "Thangalaan")

చల్లగాలీ ఓ కొండాగాలీ
చల్లగాలీ చుశావంటే
కొండాగాలీ విన్నామంటే
నేలా మీదా సందామామే నవ్వుతున్నాడే
కొత్త కోక మీద రైకే చూసి
సిగ్గే పడ్డాడే

మనకి మనకి మనలో మనకి
పండగ వచ్చిందే సానాళ్లకి
అలికి అలికి ఊరే అలికి
ముగ్గులు ఏసేదాం ముంగిళ్లకి
ఎహే ఎహే ఎహే ఎహే ఎహే
వరదొచ్చిన పెన్నా నదై
(వయసే ఉరికెనే)
వల కందని చేపలాగ
(మనసే ఎగిరెనే)
తలపాగా పొగరు కొంచెం
తనువుకు వచ్చెనే
తామర పువ్వందమంతా
తన్నుకు వచ్చెనే
ఎన్నో ఎన్నో కళ్లే
ఎకసెక లాడాయే
కొత్తా రైక ముళ్ళే కితకితలెట్టాయే
(పుట్టూ మచ్చలే దాచి పెట్టేసు కుందామే)
(హే హేయ్)

మనకి మనకి మనలో మనకి
పండగ వచ్చిందే సానాళ్లకి
అలికి అలికి ఊరే అలికి
ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకి
ఎహే ఎహే ఎహే ఎహే ఎహే
ఆడోళ్ల అందాలకి కాపలా కాస్తుందంటా
మాకోసం పట్నం నుంచి ఇప్పుడొచ్చిందంట
పంటచేల దిష్టిబోమ్మా తల తిప్పిందట
ర్తెకే ఏసిన అక్కని చూసి
కాకి అరిచిందట
నల్లాబడ్డ మేఘం చినుకై దిగొస్తే
చల్లాబడ్డ నేల చిగురై పోనందా
కొండా కోన సాక్షిగా కొరికలే తీరంగా

మనకి మనకి మనలో మనకి
పండగ వచ్చిందే సానాళ్లకి
అలికి అలికి ఊరే అలికి
ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకి

చల్లగాలీ ఓ కొండాగాలీ
చల్లగాలీ చుశావంటే
కొండాగాలీ విన్నామంటే
నేలా మీదా సందామామే నవ్వుతున్నాడే
కొత్త కోక మీద రైకే చూసి
సిగ్గే పడ్డాడే

जाने जाने जारे जाने
जाने जाने జన్నారనే
जाने जाने जारे जाने
जाने जाने జన్నారనే



Credits
Writer(s): G V Prakash Kumar, Sinduri Vishal
Lyrics powered by www.musixmatch.com

Link