Maa Oori Jatharalo (From "Bachhala Malli")

మా ఊరి జాతరలో
కాటుక కళ్లతో చాటుగ రమ్మని
సైగే చేసే చిన్నది
వాము కాడ వరసగట్టి
మంచ మీన ముద్దులెట్టి
వందేళ్ల కౌగిళల్లో ఉంటానంది పిల్లది

(ఆ బ్రహ్మే రాసే రాతలన్నీ)
(ఆపి రాసాడే పెళ్లి శుభలేఖ)
(ఆకాశం సొంత చుట్టమల్లే మారి)
(నేసిందే మల్లెపూల పడక)

రాములోరు పేర్చిన (ఆహా)
రాళ్లు ఏరి తీయనా
ఏటి నీటి పైనే నీకు
కోటే కట్టైనా
నీటిలోన చేపలే
కాపలాగ ఉంచనా
నింగి నేల ఎన్నడూ చూడని
రాణిని చేసైనా
ఈ రాణీ వాసమంటే
అసలు ఇష్టం లేదు నాకు
నీ కోట కోసం ఎళ్లి
రామ సేతుని కదపమాకు
నీకర్ధం కావట్లేదా
మరి నాకేం కావాలో
యుద్దం చేసి తెల్లోళ్ల పైన
కోహినూరుని తెచ్చి కానుకిచైనా
వెన్నెలంటి సిన్నవాడి
కోర చూపు ముందర
వజ్రం వైడూర్యం సాటేనా
సరే పోనీ ఎంత ఖర్చైపోయినాగాని
ఏడు వింతల్లో లేనద్భుతాన్ని
నీకోసం తెచ్చి ఇస్తానే పిల్లో
అరే బాబు నీ మాటే నీదేగాని
నీకర్ధం కాలేదా
నిజంగా మరి నాకేం కావాలో
కాలి అందె గల్లుమని
చిన్ని గుండె జల్లనే
సోయగాల జల్లులో
తడిసిందిరో నా మది
చలి చంపేసే స్నానాల వేళ
వెచ్చని ఊపిరి సెగల
చలి మంటేసైనా
మీసమొచ్చి గుచ్చుతుంటే
వీసమెత్తు సోయగం
రాజేసుకుంటే అదేనా
పిల్లదానా నా ఊహల సంచిలోన
ఉన్నవన్నీ పంచుకున్నా
ఇవి చాల్లేదంటే ఇంకేం కావాలే
ప్రేమించి తాళి కట్టించుకున్నాక
అర్ధ భాగం నువ్విచ్చాక
అంత కంటే కానుక లేదుగా
ఊహలు ఆపేసే ఇంక

(ఆ బ్రహ్మే వేసే ముడులు అన్నీ)
(ఆపి వేసాడే మీకు కొంగు ముడినే)
(ఆకాశం తానే శిల్పి లాగా మారి)
(చెక్కిందే మీకు ప్రేమ గుడినే)



Credits
Writer(s): Sreemani
Lyrics powered by www.musixmatch.com

Link