Chuttamalle (From "Devara Part 1")

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు

రా నా నిద్దర కులాసా
నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాసా
రా నా ఆశలు పోగేశా
నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్ధం చేశా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణి కట్టింది
గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు
మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరీ
వాస్తుగా పెంచనిట్టా వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ
చేయరా ముద్దుల దాడి
ఇష్టమే నీ సందడీ
ముట్టడించి ముట్టేసుకోలేవా
ఓ సారి చేజారీ
రా ఏ బంగరు నెక్లీసు
నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నను శింగారించు
రా ఏ వెన్నెల జోలాలి
నన్ను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచం ఆలోచించు

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణి కట్టింది
గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు



Credits
Writer(s): Anirudh Ravichander
Lyrics powered by www.musixmatch.com

Link