Raavana (From "Jai Lava Kusa")

అసుర రావణాసుర
అసుర అసుర రావణాసుర

విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక
వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక

శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక

ఓ... ఏక వీర శూర క్రూర కుమార
నిరంకుశంగ దూకుతున్న ధానవేశ్వరా
హో... రక్త ధార చోర ఘోర అఘోర
కర్కశంగ రేగుతున్న కాలకింకరా
రావణ (జై జై జై)
శత్రు శాసన (జై జై జై)
రావణ (జై జై జై)
సింహాసన (జై జై జై)

అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర
చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక
ముజ్జగాల ఏక కాల పలురకాల ధ్వంసక

ఖడ్గ భూమి కార్మిక కధనరంగ కర్షక
గ్రామ నగర పట్టణాల సకల జనాకర్షక
ఓ... అంధకార తార ధీర సుధీరా
అందమైన రూపమున్న అతి భయంకరా
హో... ధుర్వికార వైర స్త్వైర విహార
పాపలాగ నవ్వుతున్న ప్రళయ భీకర
రావణ (జై జై జై)
శత్రు శాసన (జై జై జై)
రావణ (జై జై జై)
సింహాసన (జై జై జై)

నవరసాల పోషక నామరూప నాశక
వికృతాల విద్యలెన్నో చదివిన వినాశక
చరమగీత గాయక నరక లోక నర్తక
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక
హో... అహంకార హార భార కిశోర
నరాలు నాగు పాములైన నిర్భయేశ్వరా
హో... తిరస్కార తీర నేర కుటీర
కణము కణము రణములైన కపాలేశ్వరా
రావణ (జై జై జై)
శత్రు శాసన (జై జై జై)
రావణ (జై జై జై)
సింహాసన (జై జై జై)



Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link