Avakaya Anjaneya (From "HanuMan") [Telugu]

ఆవకాయ ఆంజనేయ
కథ మొదలెట్టినాడు సూడరయ్య
శక్తినంత కూడగట్టి
సెట్టు దులిపినాడు అంజయ్య
ఎర్ర చాయా ఎర్ర చాయా
కోతి అవతారమేంత మాయా
కత్తి సేత పట్టకుండా
కాయ కోసినాడు కపిలయ్య

అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్
సీడిమామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్
ఆయా అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్
సీడిమామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్
టెంకలోని జీడి వంకాలెనున్నా
టెంకలోని జీడి వంకాలెనున్నా
పులిగోరు పల్లతో పరపర తీసాడురో

(అంజనాద్రి హనుమంతో)
(నీ సురుకు సెప్పలేనంతో)
(అంజనాద్రి హనుమంతో)
(నీ శక్తి లెక్క ఉప్పెనంతో)

బక్కవాటం లెక్కసెయక
కల్లుప్పు కడలి ఒదలనంటే
తోక తోటి కెరటమాపి
ఒడ్డు నెండేసాడు ఉప్పుపంట
గొడ్డుకారం గొడ్డుకారం
ముక్క మునిగి పైకి పొక్కుతుంటే
సిన్నతల్లి కంటిరెప్పనంటకుండా
తిప్పే గాలివాటం

ఆవపిండి అంత చల్లి చల్లి
ఆరబెట్టినది తల్లి తల్లి
ఆవపిండి అంత చల్లి చల్లి
ఆరబెట్టినది తల్లి తల్లి
గండుపిల్లి ధూళి గట్టిగెగిరొస్తే
గండుపిల్లి ధూళి గట్టిగెగిరొస్తే
అడ్డుగా నిలుసోని అంగుటుతో మింగడురో

కాకికూతలు గొరచప్పుళ్లు
ఆవకాయ తంతు జరగుతుంటే
మెంతులేసేనంతలోనే
పిట్టలెల్లగొట్టినాడు గధ యెత్తి
ఇప్పుడొక్క దిష్టిబొమ్మ
పచ్చడొంక సూసి దిష్టి పెడితే
వెల్లులి రెబ్బల్ల జబ్బలిరిసి
నూనె తెండినాడురో కుండెట్టి
సట్టినిండా సరుకు కుక్కి కుక్కి
ఉట్టి నెత్తి మొగ్గెట్టి ఎట్టి
సట్టినిండా సరుకు కుక్కి కుక్కి
ఉట్టి నెత్తి మొగ్గెట్టి ఎట్టి
అంత పెద్ద దేవుడస్సలగలేక
అంత పెద్ద దేవుడస్సలగలేక
అవజాడి తీసి రుసిసప్పరించడురో

(అంజనాద్రి హనుమంతో)
(నీ సురుకు సెప్పలేనంతో)
(అంజనాద్రి హనుమంతో)
(నీ శక్తి లెక్క ఉప్పెనంతో)



Credits
Writer(s): Riya Mukherjee, Anudeep Dev
Lyrics powered by www.musixmatch.com

Link