Enni Janmalaina Chaalava (From "Pellam Tho Panenti")

ఎన్ని జన్మలైనా చాలవే ఎలాగ
ఎన్ని జన్మలైనా చాలవే ఎలాగ
చిన్ని జీవితాన ఆశ తీర్చుకోగా
నింగి అంచుదాకా పొంగి చేరుకోక
ఆగిపోని అలలై సాగే ఆటాడుకోగా
ఎన్ని జన్మలైనా చాలవే ఎలాగ
చిన్ని జీవితాన ఆశ తీర్చుకోగా

ప్రతీ పూట సరికొత్త సూర్యోదయం
ప్రతీ పాట రసరాగ స్వరసాగరం
ఆకే చిరుగాలులతో తూగే చిగురాకులతో
ప్రతీ తోట చెబుతుంది సుమస్వాగతం
అందాలన్నీ అందెలు కట్టే
ఈ నర్తనశాల
చిందించే ఆనందాల
చినుకులు చూడాలంది
హా ఎన్ని జన్మలైనా చాలవే ఎలాగ
చిన్ని జీవితాన ఆశ తీర్చుకోగా

ప్రతీ సంధ్య రవివర్మ చిత్రోత్సవం
ప్రతీ రాత్రి స్వప్నాల స్వర్ణోదయం
కళకై ఎదురేగనా కలకై నిదురించనా
ఇలా కరిగిపోతున్న ప్రతి ఒక క్షణం
తనలో నిత్యం కొలువుంచాలని
మదిలో ఆరాటం
పరిగెత్తే ఈ కాలాన్ని ఆపేయాలనుకుంటే
ఎన్ని జన్మలైనా చాలవే ఎలాగ
చిన్ని జీవితాన ఆశ తీర్చుకోగా
నింగి అంచుదాకా పొంగి చేరుకోక
ఆగిపోని అలలై సాగే ఆటాడుకోగా



Credits
Writer(s): Sirivennela Sitharama Shastry, S V Krishna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link