Nagumomu Thaarale (From "Radhe Shyam")

నగుమోము తారలే తెగిరాలె నేలకే
ఒకటైతే మీరిలా చూడాలనే
సగమాయె ప్రాయమే, కదిలేను పాదమే
పడసాగె ప్రాణమే తన వెనకే

మోహాలనే మీరేంతలా ఇలా
మోమాటమే ఇక వీడేనులే

(ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధేశ్యామ్ (రాధేశ్యామ్)
ఇద్దరోలోకమయ్యే ఈ రాధేశ్యామ్ (రాధేశ్యామ్))

నగుమోము తారలే తెగిరాలె నేలకే
ఒకటైతే మీరిలా చూడాలనే

కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి
అణకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి
ఎచటకు ఏమో తెలియదుగా
అడగనేలేని చెలిమిదిగా
పెదవులకేమో అదే పనిగా
నిమిషము లేవే విడివిడిగా

సమయాలకే (సమయాలకే)
సెలవే ఇక (సెలవే ఇక)
పేరులేనిది ప్రేమకానిది
ఓ కథే ఇదే కదా

(ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధేశ్యామ్ (రాధేశ్యామ్)
ఇద్దరోలోకమయ్యే ఈ రాధేశ్యామ్ (రాధేశ్యామ్))

మేఘాన్ని వదలని చినుకై
సంద్రాన్ని కలవని నదులై
పరిమితి లేనేలేని ప్రణయమే ఎంత అందం
అసలు కొలవక కాలం మునిగి తేలే దేహాలే
తుదకు తెలియని దూరం మరిచి కలిసెలే స్నేహం
ముగిసేటి గమ్యమేలేని పయనమిదే
మురిసేటి అడుగులతోనే
ఓ కథే ఇదే కదా

(ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధేశ్యామ్ (రాధేశ్యామ్)
ఇద్దరోలోకమయ్యే ఈ రాధేశ్యామ్ (రాధేశ్యామ్))

నగుమోము తారలే తెగిరాలె నేలకే (రాధే శ్యామ్)
ఒకటైతే మీరిలా చూడాలనే (చూడాలనే)
సగమాయె ప్రాయమే, కదిలేను పాదమే
పడసాగె ప్రాణమే తన వెనకే (తన వెనకే)



Credits
Writer(s): Krishna Kanth, Justin Prabhakaran
Lyrics powered by www.musixmatch.com

Link