Amma Yevvaro (From "Mechanic")

అమ్మ ఎవ్వరో అయ్య ఎవ్వరో
తెలియదు అన్నావు
బ్రహ్మ రాతనే మార్చి రాసి
పండగ తెచ్చావు
ఎడారి లాంటి మా జీవితాల్లో
వసంతం అయ్యావు
ఏ దైవమివ్వని వరాలు ఇచ్చి
దేవుడివయ్యావు
ఊరిట్టా వదిలేసి ఓరయ్యో
ఒంటరిగా పోతున్నావ్ మా అయ్య
నువు లేని లోకాన ఓరయ్యో
అనాధలం మేము చూడయ్యా
మా దిక్కు మొక్కు నువ్వయ్యా
మము ఓదార్చే వారింక ఎవరయ్యా
ఎవరయ్యా
అమ్మ ఎవ్వరో అయ్య ఎవ్వరో
తెలియదు అన్నావు
బ్రహ్మ రాతనే మార్చి రాసి
పండగ తెచ్చావు

అడుగు వేయని అవిటి కాళ్ళకు
నడక నేర్పినావు
వెలుగు చూడని వెర్రి కళ్ళకు
కలలు పంచినావు
వాడిపోతున్న వాలిపోతున్న
మొగ్గ దశలోనే మాడిపోతున్న
వేల పసివాళ్ళ వేలు పట్టుకొని
వెలుతురై దారి చూపావు
లేత హృదయాల్లో ఉదయమై
నువ్వు ఉద్భవించినావు
కాడు కానున్న వాడకొచ్చావు
వనములా మార్చి
వీడుకోలంటూ వెళుతూ ఉన్నావు
అమ్మ ఎవ్వరో అయ్య ఎవ్వరో
తెలియదు అన్నావు
బ్రహ్మ రాతనే మార్చి రాసి
పండగ తెచ్చావు

గొంతు మింగని జల పిశాచిని
అంతం చేసినావు
గుండె తడిపిన అమృత గంగని
సొంతం చేసినావు
పూసే పువ్వుల్లో కాసే కాయల్లో
ధారలై సాగే ఏటి సవ్వళ్ళో
తొలకరై కురిసే చినుకు తళుకుల్లో
ఆశగా నిన్ను చూస్తాము
పుట్టే ప్రతి పాప బోసి నవ్వుల్లో
నిన్ను కలుసుకుంటాం
గుడిని ఏనాడో వదిలి వచ్చావు
గుండె గుండెకో గుడిని కట్టి
మొక్కుతూ ఉన్నావు
అమ్మ ఎవ్వరో అయ్య ఎవ్వరో
తెలియదు అన్నావు
బ్రహ్మ రాతనే మార్చి రాసి
పండగ తెచ్చావు
ఊరిట్టా వదిలేసి ఓరయ్యో
ఒంటరిగా పోతున్నావ్ మా అయ్య
నువు లేని లోకాన ఓరయ్యో
అనాధలం మేము చూడయ్యా
మా దిక్కు మొక్కు నువ్వయ్యా
మము ఓదార్చే వారింక ఎవరయ్యా

ఎవరయ్యా ఓ ఓ ఓ ఓ ఓ



Credits
Writer(s): Vinod Yajamanya, N. Muni Sekhar
Lyrics powered by www.musixmatch.com

Link