Naa Kadhalo

(అచ్చట ఇచ్చట ముద్దొచ్చే ముచ్చట)
(అచ్చట ఇచ్చట ముద్దొచ్చే ముచ్చట)
(అందంగా అల్లుకుంటే ఆనందం)
(మనసైన ఈ పూట)
(కలిచేలా ప్రతి చోటా)
(ముడివేసే కళ్యాణమే సంతోషం)
(ప్రతి ఋతువు వాసాంతం)
(ప్రతి గురుతు నీ సొంతం)
(ఏడడుగులు అనుబంధం పెనవేస్తే)
(ప్రేమే పదిలం)

నా కలలో నువ్వున్నావా
నీ కథనే నేనైయ్యానా
నా జతగా రానున్నావా
నీ జతనై రమ్మంటావా
ఏమైయిందో నాలోన ఈవేళ
నీలో నేనే మారానిలా
ఏమౌతున్నా నాలోనే ఇకపైన
దాచుకుంటా మారాణిలా
(ఇన్నాళ్ల స్నేహం ఇకపై అనుభంధం)
(మీ జంట బాగుందట)

ఏదేమైనా నీ గుండెల్లో
ఉంటాను పదిలంగానే
ఎన్నేలైనా నీ ఊపిరినై జీవిస్తుంటాలే
(విడివిడిగా ఇన్నాళ్లు విడువను)
(ఇక నీ వేలు)
అడుగుల్లో అడుగులు వేస్తూ
మది గదిలో నూరేళ్లు చెరగదు
నీ చేవ్రాలు
మరలా మరలా జన్మే నీతో మొదలు
నా కథలో నువ్వున్నావా
నీ కథనే నేనైయ్యానా

ఏ దైవాన్నో నే కొలిచుంటా
నీ దానయ్యేందుకే
నీ రూపాన్నే నే కలగంటా
నాలో నిను మోసేందుకే
కరగాలి నీ కంట్లో
కడదాకా కౌగిట్లో
కలకాని నీ స్వర్గంలో
ఒదిగుంటా నీ ఒళ్లో
కనుమూసే ఘడియల్లో
మనసా వాచా గడిచే
నీ ప్రేమలో ప్రేమలో

(అచ్చట ఇచ్చట ముద్దొచ్చే ముచ్చట)
(అందంగా అల్లుకుంటే ఆనందం)
(మనసైన ఈ పూట)
(కలిచేలా ప్రతి చోటా)
(మురిపించే ప్రణయం ఏలే సంతోషం)
(పరువానికి వాసాంతం పెనవేస్తే సీమంతం)
(ఇరు తనువుల ఏకాంతం)
(చిగురిస్తే మీ ప్రతిరూపం)



Credits
Writer(s): Sahityya Sagar
Lyrics powered by www.musixmatch.com

Link