Soundarya Lahari (From "Pelli Sandadi")

(సౌందర్యలహరి
సౌందర్యలహరి)

సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
శృంగారనగరి స్వర్ణమంజరి రావే రసమాధురి
వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇలచేరి కనిపించు ఓసారి

సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి

శబరీబరాబరాబ
శబరీబరాబరాబ

పాల చెక్కిళ్ళు
దీపాల పుట్టిల్లు
పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు
అదిరేటి అధరాలు హరివిల్లులు
ఫక్కున చిందిన నవ్వులలో
లెక్కకు అందని రతనాలు
యతికైనా మతి పోయే ప్రతిభంగిమ
ఏదలోనే పురి విప్పి ఆడింది వయ్యారి

సౌందర్యలహరి (సౌందర్యలహరి)
స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి

శబ్బాబ బాబా శబ్బాబ బాబా
శబ్బాశబశబ్బబ్బబ్బ
శబ్బాబ బాబా శబ్బాబ బాబా

నీలి కన్నుల్లు
నా పాలి సంకెళ్ళు
నీలి కన్నుల్లు, నా పాలి సంకెళ్ళు
నను చూసి వలవేసి మెలివేయగ
ఊసులు చెప్పిన గుసగుసలు
శ్వాసకు నేర్పెను సరిగమలు
కలగంటి తెలుగింటి కలకంటిని
కొలువుంటే చాలంట నా కంట సుకుమారి

సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి



Credits
Writer(s): M.m. Keeravaani, Sirivennala Seetharama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link