Meghala Dosililo

మేఘాల దోసిలిలో తొలి మంచు పూలు
చేజారి నేలపై చెంగుమన్న లేళ్ళు
మురిపాలు తాగి మురిసే వరాలు
ముత్యాల వానై కురిసే స్వరాలు
వాడనీకుమా
నేల మీద తారలు
వణికించు జాముల్లో వెచ్చందనాలు
వెంటాడు చీకటిలో వెలుగు సంతకాలు
తెర చాటు లోకంలో తొలి ఆనవాళ్ళు
సాగుతున్న దారుల్లో విరిసే సుమాలు
వాడనీకుమా
నేల మీద తారలు

కను పాపల గదిలో నిదురై
ఆ నిదురలు తియ్యని కలలై
నీ కలలో తోచే ఈ వరాన్నే కోరుకో
రంగురంగుల పువ్వుల ఎదపై
చిన్ని నగవులు నగలుగ తొడిగే
ఏ ఫలమాసించని పసి ప్రేమలనే చేరుకో
చిగురించే ఆశలాగా చిరు ఆశయమే
నీ శ్వాసగా అలరించే పాపలు
వాడనీకుమా
నేల మీద తారలు

నడి రాతిరి గుడినే దాటి
నడిచొచ్చిన మెరుపులు వీరే
అరె బుడి బుడి అడుగులు వేసి
బుడుగులు walker-ye
చిరునవ్వులు వెన్నెల తునకై
అరుదించిన వేకువ చురుకై
తమ ఆశలనైనా నిరాశలనైనా దాచదే
విరబూసే వాన విల్లు
ఒంటి నిండా వర్ణాలు
పూసినవి పాపలు
వాడనీకుమా
నేల మీద తారలు

ప్రవాహంలో నావకు తెర చాపలాగా
నడిచేది మనతో ఈ పాపలేగా
పూసేటి ఆమనికి పచ్చందనాలు
దేవతల నవ్వుల్లో కొలువైన వాళ్ళు
వాడనీకుమా
నేల మీద తారలు
(నేల మీద తారలు)
ఒక తొలకరి చినుకుల జడిలో
ఈ గలగల మాటల సుడిలో
మీ ఊహకు అందని
ప్రశ్నగ మారిన బుడతడే
నీ మనసున నలుపును కడిగి
తన కలలకు రంగులు తొడిగి
గత జన్మల వరమై
నీ ఒడి చేరిన బాలుడే
తను ఊయలపై జాబిలిలా
ఇల గుండెలు వీడని సడిలా
ఆ కిరణాన్నే తన ధనస్సుగా
మార్చెను తెలివిలా
నలు దిక్కులలో తూరుపులా
నది చెక్కిలిపై కెరటంలా
చెలరేగిన ఆశను ఆపదు
ఇక ఏ సాధ్యమా
వాడనీకుమా
వాడనీకుమా
వాడనీకుమా
వాడనీకుమా
వాడనీకుమా



Credits
Writer(s): Shankar-ehsaan-loy, Vanamala
Lyrics powered by www.musixmatch.com

Link