Manasanta Mukkalu Chesi

సానిరిస
సానిరిస
నిసరీసా నిసరీసా దనిప
మపదనిసా

సనిరిసా

సనిరిసా (సనిరిసా)

మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై, నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా, ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం

విరిసిన పువ్వుల కొమ్మ
తను పెనవేసిన ఒక రెమ్మ
ఎవరో తెంచేస్తు ఉంటే ఒప్పుకుంటదా
బుడి బుడి అడుగుల పాపైనా
తను ఆడుకునేదొక బొమ్మైన
ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా
నువు నచ్చి మనసిచ్చి ఇపుడిక్కడ ఇది చూస్తుంటే
కనుపాపల్లో కునుకుండదే

మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం (తా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం)
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం (ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం)

వెలుతురు ఉన్నపుడేగా నీ వెనుకనే ఉంటది నీడ
ఉంటా నడిరాతిరైనా నీకు తోడుగా
చిగురులు తిన్నపుడేగా ఆ కుహు కుహు కోయిల పాట
అవుతా నీ గుండె లయగా అన్నివేళలా
నిను కోరా, ఇటు చేరా నువు ఎటువైపో అడుగేస్తే
ఎదలోతుల్లో కుదురుండదే

మనసంతా
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై, నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా, ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం

Credits
Writer(s): Ananth Sriram, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link