Yedaarilo Poolu

ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ

ఎడారి లో పూలు పూచె ఎందుకనీ
మనసు లోన తలపు మెరిసె అందుకనీ
ఎడారి లో పూలు పూచె ఎందుకనీ
మనసు లోన తలపు మెరిసె అందుకనీ
మూగవీణ పాటపాడె ఎందుకనీ హోయ్
చెలిమదిలో వలపు మొలిచే అందుకనీ
అందుకనీ
ఎడారి లో పూలు పూచె ఎందుకనీ
చెలిమదిలో వలపు మొలిచే అందుకనీ

కురులలోని పూలమాల కోరేను నన్నే
పెదవిలోని మధువులన్ని చేరేను నన్నే
ఆఆ ఆఆ ఆ
కురులలోని పూలమాల కోరేను నన్నే
పెదవిలోని మధువులన్ని చేరేను నన్నే
కోటి కోటి దీపాలు ఆటాడు వేళ
కోటి కోటి దీపాలు ఆటాడు వేళ
కోరికొకటి నన్నిపుడు వేటాడు నేల
ఎందుకనో
అందుకనే
ఎడారి లో పూలు పూచె ఎందుకనీ
చెలిమదిలో వలపు మొలిచే అందుకనీ

సిగ్గుతెరలు దాగుయున్న ఆ కోరికేదో
బుగ్గమీద రాసి చూపి ఊరించరాదా
ఆఆ ఆఆ ఆ
సిగ్గుతెరలు దాగుయున్న ఆ కోరికేదో
బుగ్గమీద రాసి చూపి ఊరించరాదా
దాచుకున్న సిగ్గులన్ని నీవాయె నేడే
దాచుకున్న సిగ్గులన్ని నీవాయె నేడే
తెరలు తొలగి మనసు కలసి ఆడేను నేడే
ఎందుకనో
అందుకనే
ఎడారి లో పూలు పూచె ఎందుకనీ
మనసు లోన తలపు మెరిసె అందుకనీ
మూగవీణ పాటపాడె ఎందుకనీ హోయ్
చెలిమదిలో వలపు మొలిచే అందుకనీ
అందుకనీ
ఎడారి లో పూలు పూచె ఎందుకనీ
చెలిమదిలో వలపు మొలిచే అందుకనీ



Credits
Writer(s): Dasarathi, N/a Ghantasala
Lyrics powered by www.musixmatch.com

Link