Nuvante Nakistamani

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ

నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల నిజమల్లే కనిపించదా
నిన్నిలా చూస్తూ ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగా ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనే లేదు ఇంకే కోరిక
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ

ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారి పోనీయకా
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link