Ivannee Dupe

గారెలు, బూరెలు, చక్రాలు, చక్కలు, బఠానీలు
బొబ్బట్లు, మామిడి తాండ్ర, సెనగుళ్ళు
చెకోడీలు, చెరుకు రసం, తాటి గుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు
చీకులు, సున్నుండలు, పీచు మిఠాయి, కట్ మిర్చీ, మసాలా వడ
ఉగ్గాని, తరవాని, పుల్లైసు, గోలి సోడా, ఊరగాయ
ఉప్పు చేప, పనస తొనలు, ఉలవ చారు, పూత రేకు, మడత కాజా
కొబ్బరుండ, egg బోండా, భేల్ పూరి, పానీపూరి, పిడత పప్పు
Half boil, అల్లం మురబ్బా, హాలీము, కారపూస, మీఠా పాను, నాటు పొగాకు
ఇవన్నీ డూపు, పిజ్జాయే top-u
ఇవన్నీ డూపు, పిజ్జాయే top-u
ఇవన్నీ డూపు, పిజ్జాయే top-u

అన్న, వదిన, అత్తగారు, మామగారు, బావగారు
సొంత పిన్ని, సవితి పిన్ని, తమ్ముళ్ళు, చెల్లెళ్లు, చిన్నాన్న
పెదనాన్న, తాత, ముత్తాత, పుత్రి, దత్త పుత్రి, మనవడు
షడ్డకుడు, ఇల్లాలు, వెలయాలు, మంచి మొగుడు, చెడ్డ మొగుడు
మరదలు, మనవరాలు, వియ్యపురాలు, వియ్యంకుడు, జేజప్ప
అవ్వ, ముత్తవ్వ, అక్క బిడ్డ, అత్త బిడ్డ, ప్రేయసి
ప్రియుడు, కీపు, timepass-u, మేనమామ, partner-u
అయినవాళ్ళు, సొంతోళ్ళు, ఙ్ఞాతి, దాయాది, ఆడ బిడ్డ
మేనకోడలు, తోటికోడలు, ఏడు తరాలోళ్ళు
పెద్ద పెళ్ళాం, చిన్న పెళ్ళాం, సవితి
ఇంటోళ్ళు, సాటోళ్ళు, రక్త బంధం, ఇల్లరికం
జాతోళ్ళు, వేలిడిసినోళ్ళు, బీరకాయ పీచులు
ఇవన్నీ డూపు, స్నేహితుడే top-u
ఇవన్నీ డూపు, స్నేహితుడే top-u
ఇవన్నీ డూపు, స్నేహితుడే top-u

శోకం, ఏడుపు, వేలం వెర్రి, ప్రేమ పిచ్చి
గుబులు, exam fail-u, చిర్రు విసుగు
వేదన, కోపం, దిగులు, నష్టం, తొందరపాటు
ప్రతీకారం, పాపం, పుల్లెట్టడ్డం, అసూయ, గేళి
డాంబికం, నీచబుద్ది, తలతిక్క, పాచిక
విద్రోహం, నాలితనం, అలకబుద్ధి, ఎనకు, నయవంచన
కల్లా కపటం, దగుల్బాజీ, మొరటితనం, మూర్ఖత్వం
డీలా, buildup-u, వికారం, దిష్టి కన్ను, లేకితనం
చిన్నతనం, కొర్రు పెట్టుడు, ఉత్త చేయి, అబద్ధం
డోకాగిరి, డింకీ, సొల్లుమాట, నస, కాక, జెర్కివ్వడం
దొంగతనం, దగాతనం, మొండిగుణం
ఇవన్నీ డూపు, జాలీయే top-u
ఇవన్నీ డూపు, జాలీయే top-u

కుప్పన్న, గురవన్న, మారన్న, ముత్తన్న, కృష్ణన్న
బాలన్న, బసవన్న, చంగన్న, వీరన్న, జమలన్న
బోడిలింగన్న, భద్రాద్రన్న, నరసింగన్న, నూకన్న, సోమన్న
చిన్నన్న, పెద్దన్న, అచ్చన్న, అప్పన్న
అనిలన్న, ముత్యాలన్న, పిచ్చి పుల్లన్న, వేలన్న, కన్నన్న
పోచన్న, శివన్న, శీనన్న, నారన్న, ఇంద్రన్న
చంద్రన్న, ఇస్త్రాకన్న, ముత్యాలన్న, కుమారన్న, ఓబులన్న
రామన్న, రంగన్న, అక్కన్న, అంజన్న, ఎల్లన్న, బంగారన్న
ఇవన్నీ డూపు, మల్లన్న top-u
ఇవన్నీ డూపు, మల్లన్నే top-u

మల్లన్న top-u



Credits
Writer(s): G Devi Sri Prasad, Sahithi Cherukupalli
Lyrics powered by www.musixmatch.com

Link