Inthandanga

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు

నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు
నా కన్నుల్లోన నీ రూపం, నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి
ఈ అనుభవమే నాకు తొలిసారి
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు

నిన్ను చూస్తే నిన్నలేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓ లలనా
ఎందుకో నా గుండెలోన ఎదో హైరాన హైరాన
ఎంతమంది ఎదుటవున్న ఒంటరినౌతున్నా
ఈ అల్లరి నీదేనా... నను అల్లిన థిల్లానా
అనుకున్నానా మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని... అందం... అందం
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు

మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా
నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్నా
ఊహలన్నీ వాస్తవాలై నీలా మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా
అ దైవం ఎదురైన ఈ భావం నిలిపేనా
అనుకున్నానా మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని... అందం... అందం
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు
నా కన్నులొన నీ రూపం, నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి
ఈ అనుభవమే నాకు తొలిసారి



Credits
Writer(s): Viswa, Raghava Lawrence
Lyrics powered by www.musixmatch.com

Link