Pataley Pranami

పాటలే ప్రాణమనీ
పాడనా పాటలనీ
పాటలే ప్రాణమని
పాడనా పాటలని
గాలిలో తేలి తూలు పూలతావి కాదా సంగీతం
మనసు మీటే పాటవింటే స్వర్గమే నీ సొంతం
పాటలే ప్రాణమని
పాడనా పాటలని

కలతే లేదు కోయిలకీ పాటే ఉంటే
అలుపే రాదు తుమ్మెదకీ ఝుం ఝుం అంటే
తుళ్ళింతల నదిలో అలలకు తెలుసును తకదిమి తాళం
కవ్వింతల చలి చలి గాలికి తెలియనిదా హిందోళం
అందరికీ అనుభవమేగా పాటలలో ఆ సంతోషం
శివుడైనా ఆడకమానడు వింటే చక్కని సంగీతం
పాటలనే ప్రేమించే మనసు నందనం
పాటలే ప్రాణమనీ
పాడనా పాటలనీ

పాటే మనిషి ఆనందం పాటే అందం
పాటే ప్రేమ సందేశం పాటే బంధం
తానుసేను పాటకు మురిసి కురిసెను జల్లుగా మేఘం
శ్రీకృష్ణుడి మనసే దోచెను మీరా తీయని గానం
ఆవేశం నిప్ఫై రగిలే నా పాటే నా గాంఢీవం
జగమంతా దాస్యం చేసే అద్భుతమే నా సంగీతం
నమ్మకమే ఆయుధము బ్రతుకు పోరులో

పాటలే ప్రాణమని పాడనా పాటలని
గాలిలో తేలు పూలు పూలతావి కాదా సంగీతం
మనసు మీటే పాట వింటే స్వర్గమే నీ సొంతం
పాటలే ప్రాణమని పాడనా...



Credits
Writer(s): S.a.raj Kumar, E.s. Murthy
Lyrics powered by www.musixmatch.com

Link