Ramachakkani Sithaki Arrachetha Gorinta

నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధురవదన నళిననయన మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట
రామ చక్కని సీతకి

ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే
చూసుకోమని మనసు తెల్పి మనసు మాటలు కాదుగా
రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగుడంట
రామ చక్కని సీతకి

ఇందువదన కుందరదన మందగమన భామా
ఎందువలన ఇందువదన ఇంతమధన
ప్రేమా

సాహిత్యం: వేటూరి



Credits
Writer(s): Veturi Sundararama Murthy, K M Radha Krishnan
Lyrics powered by www.musixmatch.com

Link