Manasa Ottu

మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి
నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి
ఇపుడు చూపించొద్దు
అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చినా
అవి పొందలేనని నీ మూగ బాధని
కరిగించనివ్వవే కంచెల హద్దు

మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి
నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి
ఇపుడు చూపించొద్దు
అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చినా
అవి పొందలేనని ఈ మూగ బాధని
కరిగించనివ్వవే కంచెల హద్దు
నీ కంటి చూపులోన
ఒదిగిపోయి నేను
నూరేళ్ళ తీపి స్వప్నంలా
బతుకుతూనే ఉంటాను
పడమటింటి పడక మీద
మల్లెపూలు వేసి
ప్రతి సంధ్యలోన నీకోసం
ఎదురుచూస్తు ఉంటాను
ఎలా చెప్పను ఎలా చెప్పను
మూడునాళ్ల నిజం నేనని
ఈ తియ్యని జ్ఞాపకాలను
మరు జన్మకే పంచి ఇవ్వని
ఆ రోజు కోసమే ప్రతిరోజు గడపనీ
క్షమించు నేస్తమా వద్దనవద్దు

మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి
నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి
ఇపుడు చూపించొద్దు
వెంటాడకమ్మా ఎడారి ఎండ మావిని
తను ఇవ్వలేని అమృతాన్ని
నీకు అందిమ్మని
కొలువుండకమ్మా సమాధి నీడ చాటుని
చితి మంట చూసి
కోవెలలో యజ్ఞవాటి అనుకొని
మంటలారని గుండె జ్వాలని
వెంటతరమకు జంటకమ్మని
ఏ భాషలో నీకు చెప్పినా
ఏ భావమో మూగ బోయిన
నువు పట్టు వదలని విక్రమార్కుడై
నీ ప్రేమతో నన్నే చంపెయ్యోద్దు

మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి
నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి
ఇపుడు చూపించొద్దు



Credits
Writer(s): Seetharama Sastry, M M Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link