Meesam Unna (From "Sneham Kosam")

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా
కోపమెక్కువా కానీ మనసు మక్కువా
స్నేహానికి చెలికాడా దోస్తీకీ సరిజోడా
ఏల్లెదిగిన పసివాడ ఎన్నటికి నిను వీడా

మీసమున్న నేస్తమా... హాయ్

ఏటి గట్టు చెబుతుంది అడుగు మన చేప వేట కథలూ
మర్రి చెట్టు చెబ్తుందీ పంచుకొన్న తిన్న సద్ది రుచులూ
చెరుకు తోట చెబుతుంది అడుగు ఆ నాటి చిలి పనులూ
టెంటు హాలు చెబుతుంది NTR స్టంటు బొమ్మ కథలూ
పరిగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ
ఎన్నేల్లో గడిచాయి ఆ గురుతులనే విడిచాయీ
వయస్త మరచికే వింతలాడె ఆ తీపి గ్ఞాపకాలు
కలకాలం మనతోటె వెన్నంటే ఉంటాయీ
మన లాగే అవి కూడా విడిపోలేనంటాయీ

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా

ఒక్క తల్లి సంతానమైన మన లాగ ఉండగలరా
ఒకరు కాదు మనమిద్దరంటె ఎవరైన నమ్మగలరా
నువ్వు పెంచినా పిల్ల పాపలకు కన్న తండ్రినైనా
ప్రేమ పంచినా తీరులోన నే నిన్ను మించగలనా
ఏ పున్యం చేశానో నే నీ స్నేహం పొదాను
నా ప్రాణం నీదైనా ఈ చెలిమి రుణం తీరేనా
నీకు సేవ చేసేందుకైన మరు జన్మ కోరుకోనా

స్నేహానికి చెలికాడా దోస్తీకీ సరిజోడా
ఏల్లెదిగిన పసివాడ ఎన్నటికి నిను వీడా

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా
కోపమెక్కువా కానీ మనసు మక్కువా
స్నేహానికి చెలికాడా దోస్తీకీ సరిజోడా
ఏల్లెదిగిన పసివాడ ఎన్నటికి నిను వీడా



Credits
Writer(s): S.a. Rajkumar, Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link