Manasa Manninchavamma

మనసా మన్నించమ్మా
మార్గం మళ్ళించమ్మా
నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా
స్వప్నం చెదిరిందమ్మా
సత్యం ఎదరుందమ్మా
పొద్దేలేని నిద్దర్లోనే నిత్యం ఉంటావా

ప్రేమా ప్రేమా నీ పరిచయం
పాపం అంటే కాదనలేవా
ప్రేమా ప్రేమా నీ పరిచయం
పాపం అంటే కాదనలేవా

ప్రేమాలయంలా ఉంటే నీ తలపు
ప్రేమే దైవంలా కొలువుంటుందమ్మా
దావానలంలా తరిమే నిట్టూర్పు
ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా
అంతదూరం వుంటేనే చందురుడు చల్లని వెలుగమ్మా
చెంతకొస్తే మంటేనే అందడని నిందించొద్దమ్మా
మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా
తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా
ప్రేమా ప్రేమా నీ స్నేహమే
తీరని శాపం అనిపిస్తావా

ఒక చినుకునైనా దాచదు తన కోసం
నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం
నదులన్ని తానే తాగే ఆరాటం
కడలికి తీర్చేనా దాహం ఏమాత్రం
పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు
పల్లకిపై పంపించి చల్లగా దీవించవే నేడు
జ్ఞాపకంలో తియ్యదనం చేదుగా మార్చవ కన్నీళ్ళు
జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపకు నూరేళ్ళు
ప్రేమా ప్రేమా మదిలో భారం
కరిగించేలా ఓదార్చవా



Credits
Writer(s): Yuvan Shankar Raja, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link