Cheppinaadhey Thana Premani

చెప్పినాదే తన ప్రేమని
విని ఆపేదెట్టా గుండెని
ఈ మాటను ఎవరు చెప్పగా నే వినలేదులే
ఇక ఇంకొక మాటను నా మనసు వినలేదులే
తాను చెప్పిన మాటే చాలు
ఆ మాటే ఓ పదివేలు, వేలు

చెప్పేసానే నా ప్రేమని
చెప్పి ఆపేదెట్టా గుండెని
ఈ మాటను ఎవరికీ ఇంతవరకు చెప్పలేదులే
ఇక ఇంకొక మాటని చెప్పాలనే ఆశ లేదులే
నీ ప్రేమే నాకు చాలు
నాకదియే ఓ పదివేలు, వేలు

అమ్మ మాటెన్నెడు విన్లేదులే
నాన్న మాటైనను విన్లేదులే
నీ మాటే వింటూ ఉన్న
నువ్వు నేను జంటే అన్న
మనసును విప్పి చెబితే మనకిది లేనిది లోకంలో
ప్రేమను మాటే వింటే సంతోషము నిండును హృదయంలో
అరేయ్ చెప్పిన మాటే చాలు
ఆ మాటే ఓ పదివేలు, వేలు
చెప్పేసానే నా ప్రేమని
చెప్పినాదే తన ప్రేమని

ఎన్నెన్నో మాటలు చెప్పాయకే గుండెల్లో ఉండి పోతాయట
చెప్పడమే ఎంతో ఇష్టం చెప్పుకుంటే రాదే కష్టం
పెదవులు పలికినవే చెదురును అవిమారు నిముషంలో
హృదయము పలికినది పోకుండా నిలుచును రక్తంలో
అరేయ్ చెప్పిన మాటే చాలు
ఆ మాటే ఓ పదివేలు, వేలు

చెప్పేసానే నా ప్రేమని
చెప్పి ఆపేదెట్టా గుండెని
ఈ మాటను ఎవరికీ ఇంతవరకు చెప్పలేదులే
ఇక ఇంకొక మాటని చెప్పాలనే ఆశ లేదులే
నీ ప్రేమే నాకు చాలు
నాకదియే ఓ పదివేలు, వేలు, వేలు



Credits
Writer(s): Imman David, Vennelakanti Subbu Rajeswara Prasad
Lyrics powered by www.musixmatch.com

Link