Narajugakura

మనిషి పుట్టినాక పుట్టిింది మతము
పుట్టి, ఆ మనిషినే వెనక్కి నెట్టిింది మతము
తల్లి కడుపులో నుండి వెల్లినట్టి మనిషి
తలచకురా ఏ చెడ్డ గతము
ఏ చెడ్డ గతము
(ఏ చెడ్డ గతము)
నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ
ముద్దుల కన్నయ
అరె మనరోజు మనకుందిమన్నయ
నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ
ముద్దుల కన్నయ
అరె, మనరోజు మనకుందిమన్నయో
అనువు గాని చోట
నువ్వు అధికుడన్న మాట
అనవద్దు నంట నన్న
వేమన్న గారిమాట
వినలేదా నువ్వు बेटा
బంగారు పలుకు మాట
హోయ్
నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ
ముద్దుల కన్నయ
హొయ్
మనరోజు మనకుందిమన్నయో
అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే
రామదాసు రాముని గుడికట్టినుగా
కులీ కుతుబ్ షాహీ ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనుగా
నవాబులు నిర్మించిన నగరములందు
నవాబులు నిర్మించిన నగరములందు
కులమతాల గొడవలు మనక్కెందుకురన్నా ఇంక్కెందుకురన్నా
హెయ్
నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ
ముద్దుల కన్నయ
హొయ్
మనరోజు మనకుందిమన్నయ

విన్నావా సోదరుడా
మొన్న నీకు दवाखाना లో జరిగినట్టి సంఘటన మానవతకు మచ్చుతునక
తన చావుతో ముస్లిము
మన హిందూ సోదరులకి ప్రాణదానమచ్చిండు తన కిడ్నిలను తీసి
మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా
మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా
మనుషుల్లో సైతానులకు పట్టదన్నా
ఇదిపట్టిదన్నా
హెయ్
నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ

ముద్దుల కన్నయ
హొయ్
మనరోజు మనకుందిమన్నయ
పీర్ల పండగోచ్చిందా ఊర్లల్లో మనవాళ్ళు
డపుుల దరువేసుకుంటు కోలాటలు ఆడుతారు
సదరు పండగోచ్చిందా పట్నంలో ప్రతివారు
దున్నపోతులాడిస్తూ दिल खुशी లు చేస్తూంటారు
ఎవడేమి అంటే మనకేమిటన్న
ఎవడేమి అంటే మనకేమిటన్న
జాషువా విశ్వనరుడు నువ్వేరన్న
ఎప్పుడు నువ్వేరన్నా
హెయ్
నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ
ముద్దుల కన్నయ
హొయ్
మనరోజు మనకుందిమన్నయ

నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినొన్ని
నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినొన్ని
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలర్పేస్తాడమ్మో నాయకుడు
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలర్పేస్తాడమ్మో నాయకుడు
మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు
మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు
మా గుడిలో మొక్కు అంటాడమ్మో నాయకుడు
మా ప్రార్థన చేయింటాడమ్మో నాయకుడు
దేవుళ్ళుని అడ్డంగా పెట్టినాయకుడు
దేవుళ్ళునే దోచేస్తాడమ్మో నాయకుడు
అధికారం తన పదవి కొరకు నాయకుడు
మత కలహం మంటేస్తాడు అమ్మో నాయకుడు
మత కలహం మంటేస్తాడు అమ్మో నాయకుడు
మత కలహం మంటేస్తాడు అమ్మో నాయకుడు
మత కలహం మంటేస్తాడు అమ్మో నాయకుడు
మత కలహం మంటేస్తాడు అమ్మో నాయకుడు



Credits
Writer(s): Ramana Gogula, Masterji
Lyrics powered by www.musixmatch.com

Link