Dolu Bhaja

శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం
డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా
కాళేశ్వరా హరే నీ కాలి అందే
భాగ్యమేదో నాకివ్వరా
నీ ముందు నేను చిందేసే యోగం
రోజు నాకు అందించరా
అహ ముక్కంటి నువే దిక్కంటి
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండెకాదా నీ వెండి కొండ
ఉండిపోరా లోకేశ్వరా
డోలేరే డోలేరే డోలేరే

హే నీ శిరస్సుపైన ఏమున్నది
చందమామ వెలుగున్నది
నీ గొంతుపైన ఏమున్నది
నీలి రంగు నీడున్నది
అరె డం డం డం డమరుకములు చెప్పాయి
నీలో వెలుగు నీడ కలిసున్నది
హే దగ్ దగ్ కుదుపు భయము ఉండొద్దు అంటూ
నీలో ఉన్నా సత్యాన్ని కంటున్నా
ముక్కంటి నువ్వే దిక్కంటి
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ
ఉండిపోరా లోకేశ్వరా
హరహర మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ శివశంకరా
హే నీ కంటిలోన నిప్పున్నది
భగ్గుమంటే బొగ్గయితది
ఆ అగ్గినాపేదేమున్నది గంగ నీకు తోడున్నది
అరె భం భం సదరుగుణము అంటుంది నీలో
నీరు నిప్పు కూడున్నది
మరి ఘం ఘం మనిషి మనిషి కలిసుండాలంటూ
నీవు చెప్పే వేదాన్ని వింటున్నా శంభో శివశంభో
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ
ఉండిపోరా లోకేశ్వరా
డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా
కాళేశ్వరా అరె నీ కాలి అందే భాగ్యమేదో నాకివ్వరా
నీ ముందు నేను చిందేసే యోగం
రోజు నాకు అందించరా
అహ ముక్కంటి నువే దిక్కంటి
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ
ఉండిపోరా లోకేశ్వరా

హరహర మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ శివశంకరా
డోలేరే డోలేరే డోలేరే
హరహర మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ శివశంకరా



Credits
Writer(s): Suddhala Ashok Teja, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link