Ammanu Minchina

అమ్మను మించిన దేవత వంటిది మా అక్క
కమ్మని మమతల తరగని పెన్నిధి మా అక్క
అమ్మను మించిన దేవత వంటిది మా అక్క
కమ్మని మమతల తరగని పెన్నిధి మా అక్క
అక్కకు కళ్యాణమే, నిండుగ వైభోగమే
అందరు వచ్చేరంట, దీవెనలిచ్చేరంట
మహాలక్ష్మి నడిచేటి, సిరులు కురిసేటి బంగరు మా అక్క
మా ఇంట జరిగేటి సంబరమే ఈ పండగ
ఏడేడు లోకాలు ఎరగనిదే ఈ వేడుక
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అమ్మను మించిన దేవత వంటిది మా అక్క
కమ్మని మమతల తరగని పెన్నిధి మా అక్క

హరివిల్లే తోరణమై ఇలకు చేరెనంట
జాబిల్లే చుక్కంతై బుగ్గ చేరెనంట

మేళాలు తాళాలు మోగుతున్న తరుణం
దేవతలే దిగి వచ్చి పలికే పెళ్ళి మంత్రం

ఆకాశం పందిరి కాగా
పుడమి తల్లి పీఠలాగా
ముత్యాలే ముగ్గులవ్వగా
రతనాలే తలంబ్రాలుగా
రంగ రంగ వైభవంగా అక్క పెళ్ళి జరిగేనంట
రంగ రంగ వైభవంగా అక్క పెళ్ళి జరిగేనంట
బంగరు వదినకు మూడు ముళ్ళ పెళ్ళంట
అందరు వచ్చి అక్షింతలు వెయ్యాలంట
బంగరు వదినకు మూడు ముళ్ళ పెళ్ళంట
అందరు వచ్చి అక్షింతలు వెయ్యాలంట

(మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా!)
(కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం)

బంగారు పల్లకిలో అక్క వచ్చునంట
బోయినై కడవరకు నేను మోయునంట

జన్మంతా వెన్నంటి అక్క వెంట ఉంటా
మరు జన్మంటూ నాకుంటే నీ కొడుకునై పుడతా

కార్యేషు దాసిలాగా నువ్వు మసలుకోవాలి
కరణేషు మంత్రిలాగా పేరు తెచ్చుకోవాలి
భోజ్యేషు మాతలాగా మెట్టినింట మెలాగాలి
శయనేషు రంభలాగా భర్త ఒడిని చేరాలి
ముచ్చట తీరగ ముద్దుల మామవుతానంట
మా నట్టింట్లో నేను లాలి పాడేనంట
ముచ్చట తీరగ ముద్దుల మామవుతానంట
మా నట్టింట్లో ల ల ల హాయి
అమ్మను మించిన దేవత వంటిది మా అక్క
కమ్మని మమతల తరగని పెన్నిధి మా అక్క
అమ్మను మించిన దేవత వంటిది మా అక్క
కమ్మని మమతల తరగని పెన్నిధి మా అక్క
అక్కకు కళ్యాణమే, నిండుగ వైభోగమే
అందరు వచ్చేరంట, దీవెనలిచ్చేరంట
మహాలక్ష్మి నడిచేటి, సిరులు కురిసేటి బంగరు మా అక్క
మా ఇంట జరిగేటి సంబరమే ఈ పండగ
ఏడేడు లోకాలు ఎరగనిదే ఈ వేడుక



Credits
Writer(s): Srikanth Deva, Poloor Ghatikachalam, Poloor
Lyrics powered by www.musixmatch.com

Link