Chelia Nee Premalone

చెలియా నీ ప్రేమలోనే
పరవశించి పోయానే
చెలియా నీ ప్రేమలోనే
పరవశించి పోయానే
పెదవి మీది సిగ్గులన్నీ
పైట చాటు దాచకే
ముద్దు కోరి చెంతకొస్తే సిగ్గులెందుకే
నీ నవ్వే సింగారమో
నీ పలుకే బంగారమో
నీ ముద్దో మందారమో
రోజా రారా రారా రా
ప్రియుడా నీ ప్రేమలోనే
పులకరించి పోయానే
మాటలన్నీ మాయ చేసి
ప్రేమకు వల వేసా
ప్రేమ మైకం పొంగిన వేళ
మౌనం సాధించా
కన్నులు నాలుగు కలిసిన వేళ
భాషకు చోటేది
మౌనం పాడే అలాపానకు మించినదేముంది
మాటలే మనసుకు బరువైతే
మౌనమే కానుక అవుతుంది
మౌనం అను భాషే రాకుంటే
ప్రేమ ఇక వ్యర్థం అవుతుంది
నీ ప్రేమ భావనే నిజం నిజం
ఏదో చెప్పాలని ఉంది
గుండె ఝల్లుమంది
సిగ్గును చెందని పూవును
తుమ్మెద అంటదులే
ముద్దును పొందని సిగ్గులో
బుగ్గలు కందవులే

చెలియా నీ ప్రేమలోనే
పరవశించి పోయానే
ప్రేమ కానుక పొందిన వేళ
సర్వం మరిచాను
నా ప్రేమకు నిత్యం
ప్రాణం పోసి కవినైపోయాను
తియ్యగ పలికిన స్వరముల
ఝల్లున మనసే తడిసింది
నీకై నిలిచి నిన్నే తలచి
ప్రాణం ఇస్తుంది
యవ్వనం వయసుకు తోడైతే
ఆశలకు పండుగ అవుతుంది
శ్వాసలో స్వర్గం కనుగొంటే
జీవితం మధురసమవుతుంది
ఇక ఊరించకే ప్రియా ప్రియా
నీ అంద చందాలన్నీ
చూసి కళ్లు చెదిరే
మదిలో దాగిన ఊహల్లో
ఊపిరి నీవైతివి
వద్దని కన్నులు మూసిన
ఎదుటే నీవుంటివి

చెలియా నీ ప్రేమలోనే
పరవశించి పోయానే
ప్రియుడా నీ ప్రేమలోనే
పులకరించి పోయానే
పెదవి మీది సిగ్గులన్నీ
పైట చాటు దాచకే
ముద్దు కోరి చెంతకొస్తే సిగ్గులెందుకే
నీ నవ్వే సింగారమో
నీ పలుకే బంగారమో
నీ ముద్దో మందారమో
రోజా రారా రారా రా

చెలియా నీ ప్రేమలోనే
పరవశించి పోయానే



Credits
Writer(s): Shivashankar, Mrutyunjayadu
Lyrics powered by www.musixmatch.com

Link