Maaghamaasama

మాఘమాసమా మౌనరాగమా మంచు మేఘమా మల్లే దీపమా
మాఘమాసమా మౌనరాగమా మంచు మేఘమా మల్లే దీపమా
నీ రాకే శుభశకునం నా ఇల్లే పూలవనం
నాకు ప్రాణమా స్నేహగీతమా పూల బాణమా తీపి గాయమా
నీ చూపే నా హృదయం నీ పూజే ప్రతి ఉదయం
చిలకల జంటల కిల కిల పాటల బృందానికే రాధవు నీవమ్మా
మాఘమాసమా మౌనరాగమా మంచు మేఘమా మల్లే దీపమా

కనులు మూసిన కనులు తెరిచిన కలలు కన్నా నీ కౌగిలింతలే
వేసవి సంధిలలో వెచ్చని సంధ్య రాగాలు
ఆశల అంచుల్లో కలిసినా జీవన తీరాలు
పిలవాలంటే పెదవే రాక నిలవాలంటే కుదురే లేక
యధ వేధించగా సుధలో ముంచగా కసిగా కమ్మగా కలలే పెంచగా
మనసుల చాటుగా గడపలు దాటిన అనురాగానికి పల్లకి ఏదమ్మా
మాఘమాసమా మౌనరాగమా

నాకు ప్రాణమా స్నేహగీతమా

పూలు కోసినా వేలు కందినా జడలు అల్లినా నీ జలదరించింతలే
మువ్వల కందనవి ముద్దులో మురళి రాగాలు
సూర్యుడు చూడనివి చూపులో దాగిన దాహాలు
నీవ్వైపోయే ఒంటరి మనసే నిప్పైపొయే తుంటరి వయసే
వడిలో చేరగా వదిగే జంటగా గుడిలో గుండెల్లో ఒకటే గంటగా
తొలకరి ఆశల తొడిమలు పూసిన కన్నె తనానికి పున్నమి వేళమ్మా
మాఘమాసమా మౌనరాగమా మంచు మేఘమా మల్లే దీపమా
నీ రాకే శుభశకునం నా ఇల్లే పూలవనం
నాకు ప్రాణమా స్నేహగీతమా పూల బాణమా తీపి గాయమా
చిలకల జంటల కిల కిల పాటల బృందానికే రాధవు నీవమ్మా

Credits
Writer(s): Vandemataram Srinivas, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link