Chilipi Chilaka I Love You

చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేలలో
కలికి చిలక కవ్వింతల తొరణాలలో
చిలక పచ్చ పైట కి
కోకిలమ్మ పాటకి రేపో మాపో
కమ్మని శోభనం...
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తొరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకీ రేపో మాపో
కమ్మని శోభనం.

సంపంగి రేకల్లో కొంపేసుకున్నాక
కలికి వొయ్యారాల ఒంపు
హా... కబురు పంపు
హా... గుబులు చంపు
వొల్లంకి రెక్కల్లో వొల్లారబోసాక
వయసు గోదాట్లోకి దింపు
హా. మారుల గుంపు
హా. మగువ తెంపు
అహో ప్రియా మహోదయ
లయా దయా లగావో
సుహాసిని సుభాషిణి చెలి సఖి చెలావో
ఈ వసంత పూల వరదలా
నను అల్లుకోవె తీగ మరదలా
నూజివీడు మామిడో
మోజుపడ్డ కాముడో
ఇచ్చాడమ్మా తియ్యని జీవితం...

చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తొరణాలలో

నీలాల మబ్బుల్లో నీళ్ళొసుకున్నాక
మెరిసిందిలే చుక్క రూపు
హా. కలల కాపు
హా. కనుల కైపు
పున్నల ఎన్నెన్నో పువ్వెట్టిపోయాక
తెలిసింది పిల్లాడి ఊపు
హా. చిలిపి చూపు
హా. వలపు రేపు
వరూధిని సరోజినీ యెదే కులుమనాలి
ప్రియ ప్రియ హిమాలయా వరించుకోమనలి
కోనసీమ కోక మడతలా
చిగురాకు రవిక ఎత్తు పొడుపు లా
కొత్త పల్లి కొబ్బరో కొంగు పల్లి జబ్బరో
నచ్చిందమ్మో అమ్మడి వాలకం

చిలిపి చిలక



Credits
Writer(s): M. M. Keeravani, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link