Thaliku Mannadi

తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార

ఓ మైనా వదలనిక ఏమైనా
నా లోన శృతిలయలు నీవేనా
గుండెల్లోన నిండే ఊహా నీవే కిరణ్, రావే కిరణ్

తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార

నేడే, కొండా కోన తోడుగా ఎండా వానా చూడగా ఈడు జోడుగా
ఎన్నో ఊసులాడగా తోడు నీడగా
ఈడు గోదారి పొంగింది చూడు నాదారికొచ్చింది నేడు ఆశ తీరగా
ప్రేమ మాగాణి పండింది నేడు మారాని పారాణి తోటి నన్ను చేరగా
గువ్వల జంటగా ఓ ఓ సాగే వేళలో
నవ్వుల పంటగా ఓ ఓ రావే నా కిరణ్

తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార

రావే, ఆకాశాన విల్లుగా ఆనందాల జల్లుగా మల్లెలు చల్లగా
ముద్దే నేడు తీయగా తెరే తీయగా
గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చి పానుపేయగా
కోటి మందార గంధాల తోటి అందాల చందాలు నాకు కానుకీయగా
ఊహల లాహిరి ఓ ఓ ఊగే వేళలో
ఊపిరి నీవుగా ఓ ఓ రావే నా కిరణ్

తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార

ఓ మైనా వదలనిక ఏమైనా
నా లోన శృతిలయలు నీవేనా
గుండెల్లోన నిండే ఊహా నీవే కిరణ్, రావే కిరణ్



Credits
Writer(s): Thotakura Somaraju, Saluri Koteswara Rao, Vennelakanti Subbu Prasad
Lyrics powered by www.musixmatch.com

Link