O Kala Kannadi

సాహిత్యం: చంద్రబోస్

కొంగు చాటు కృష్ణుడమ్మా కన్నెకెంతో ఇష్టుడమ్మా కన్నుగప్పి జరిపోయేనే
గుండె చాటు ఆశలన్ని కొల్లగొట్టి చెప్పకుండా వెళ్ళిపోయి ఈడదాగెనే
వాడ్ని కన్నెకైదులో కడిపి అడ్డుపెట్టుకో వేడికౌగిలింత కంచే దాటి వెళ్లకుండా కాపుకాసుకో

ఓ కలగన్నది వరమైనది మనసైన వేళలో
ఓ అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో
గిల్లుకొని చూసేదా అల్లుకొని చూపేదా
పట్టపగలే వెన్నెలంటే నేడు తెలిసే హా

ఓ కలగన్నది వరమైనది మనసైన వేళలో
ఓ అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో

ఘుమ్ ఘుమ్ గుప్పుమంటు గులాబీల తోట గుండెల్లోన పూసే ఈ పూట (2)

వేడి ఊపిరి వేణు నాధంలా పడుతున్నదే ప్రేమ వేధంలా
లేడి చూపులే తేని వాగుల్లా తాకుతున్నవే తీపి ఊహల్లా
చేతికందేనమ్మా పురిటి చందమామ ఎందుకందేనమ్మా కన్నె సిగ్గు సీమ
పాలరాతి బొమ్మా ప్రాణమొచ్చెనమ్మా
హారతిచ్చి స్వాగతించు కౌగిలింత చేరువైన హాయిలో

ఓ కలగన్నది వరమైనది మనసైన వేళలో
ఓ అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో

ఏడు రంగాల వానవిల్లల్లే ఈడు పొంగెనే కంటి విందల్లే
గుండె కోనలో స్వాతి జల్లల్లే నిండు స్నేహమే పండే వరమల్లే
సొంతమైన జాణ సోయగాల వీణ
బంతిపూల మేన నీకు మేము ఫ్లేమా
పైడి ప్రయమంత కానుకిచ్చుకోన
జన్మలోన జారిపోని బ్రహ్మముడ్లు వేసినిన్ను ఏలుకుందునా

ఓ కలగన్నది వరమైనది మనసైన వేళలో
ఓ అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో
గిల్లుకొని చూసేదా అల్లుకొని చూపేదా
పట్టపగలే వెన్నెలంటే నేడు తెలిసే హా

కొంగు చాటు కృష్ణుడమ్మా కన్నెకెంతో ఇష్టుడమ్మా కన్నుగప్పి జరిపోయేనే
గుండె చాటు ఆశలన్ని కొల్లగొట్టి చెప్పకుండా వెళ్ళిపోయి ఈడదాగెనే



Credits
Writer(s): Chembolu Seetharama Sastry, M. M. Srilekha
Lyrics powered by www.musixmatch.com

Link