Andala Aparanji Bomma

స్వర్గాన ఉన్న మాతా
నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన
నీ మాటగా నేను చెప్పేదా తల్లి
ఆహ! దివ్యోపదేశం దివ్యోపదేశం, మాతా
చెప్ uncle
అమ్మ ఎంచెప్పిందో చెప్పు
చెప్పవా, చెప్పవా?
చెప్పు, చెప్పు
చెప్ప్తాను తల్లి, చెబుతా

అందాల అపరంజి బొమ్మ
అమ్మ ఎదంటూ బెంగ పడకమ్మ
కడుపార నిను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంట చెమ్మ
తను మరుగునున్న నిను మరువదమ్మ
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ

అందాల అపరంజి బొమ్మ
అమ్మ ఎదంటూ బెంగ పడకమ్మ

ఆకలందంటే ఆ చిన్ని బొజ్జ
అడగకుండానే తెలుసుకోమంది
ఆటాడుకోగా తోడెవ్వరంటే
అంబారి కట్టి ఆడించమంది
నీకేం కావాలన్నా నాకు చెపుతూ ఉంటానంది
తానే లోకానున్న నిన్ను చూస్తూ ఉంటానంది
కాపాడుకుంటా కనుపాపలాగా
నిను చూసుకుంటా మీ అమ్మలాగా
నమ్మమ్మ నా మాట

అందాల అపరంజి బొమ్మ
అమ్మ ఎదంటూ బెంగ పడకమ్మ

మావయ్యనంటూ నిన్ను చెరమన్ది
మంచి మాటలతో మరిపించమంది
కథలెన్నో చెప్పి నవ్వించమంది
ఒడిలోన చేర్చి వోదార్చమంది
జో జో పాపా అంటూ తాను రోజు పాడే లాలి
ఇట్టా పాడాలంటూ నాకు తానే నేర్పింది తల్లి
మా పాపనెప్పుడు కాపాడమంటూ
దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే పని మీద వెళ్ళింది

అందాల అపరంజి బొమ్మ
అమ్మ ఎదంటూ బెంగ పడకమ్మ
కడుపార నిను కన్న అమ్మ
చూడలేదమ్మ నీకంట చెమ్మ
తను మరుగునున్న నిను మరువదమ్మ
కన్నీరు తుడిచే కబురంపెనమ్మ
చెబుతాను వినవమ్మ

అందాల అపరంజి బొమ్మ
అమ్మ ఎదంటూ బెంగ పడకమ్మ



Credits
Writer(s): Sirivennela Seetharama Sastry, S.v. Krishna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link