Naa Mogude Brahmachari

యాహూ
రంగమ్మత్తా, అనుసూయక్క, సీతమ్మొదినా
చెల్లాయమ్మా ఇది విన్నారా
ఏమిటే
కొత్తగా వచ్చిన bank managerకి
పెళ్లి కాలేదు
అలాగా అయితే మా మనవరాల్నిచ్చి చేస్తాను
మనవరాలికిచ్చి చేస్తావా
పోనీ నువ్వే చేసుకోకూడదు
మా ముసలోడొప్పుకోడెమోనే
సిగ్గులేకపోతే సరి వాడు నా మొగుడూ
నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి
మూడేళ్ల కిందటే ఈడొచ్చింది
మూడేళ్ల కిందటే ఈడొచ్చింది
ముదురు బెండకాయ చూసి మూడొచ్చింది

నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి
సోదెమ్మా సోదెమ్మా ఎలా ఉంది మా జంట
జంట అది ఇప్పపూల పంట
అయితే మా పెళ్లెప్పుడంటా
చెబుతాను చెబుతాను
కంచి కామాక్షి మధుర మీనాక్షి
బెజవాడ కనకదుర్గ మీన ఆన
ఇనుకోయే కునా నీ పక్కనున్న పోటుగాడే
నిన్ను ఎదుక్కుంటా వచ్చిన ఏటగాడు
ఈడే నీ మెడ్లో తాళి కడతడు
నీ ఒళ్లో తల పెడతడు
నీ ఊపుకు పగ్గమేస్తడు
ఉయ్యాలకి పాపనిస్తడు
ఇది ఎరుకల సాని మాట
యాహూ
ఒడ్డు చుస్తే పొడుగు నాకు తెలిసివచ్చింది
బొడ్డు కింద చీరకట్టు అలిసిపోయింది
వాడి చూపు కన్నే వయసు పోపు పెట్టింది
రేపునైనా చెయ్యమంటూ రెచ్చగొట్టింది
ఉలకడు అసలే పలకడు
ఉలకడు అసలే పలకడు
రవికుల తిలకుడు రవికే అడగడు

నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి
చారి గారు పూజారి గారు
మేము చేసేసు కుంటున్నాము
ఏమిటి
Love-u
అవ్వా నువ్వా loveఆ
అవునోయ్ చెవిలో పువ్వా
పెట్టుమరి పెళ్లి ముహూర్తం
పెడతా పెడతా చూసి మరీ పెడతా
స్వస్తి శ్రీ ప్రజాపతి నామ
ప్రజాపతి హలోపతి హోమియోపతి
ఏమిటీ సుత్తి
ముందు ఈ పతి సంగతి చెప్పు
వస్తున్నా వస్తున్నా
వైశాఖ మాసే శుక్లపక్షే
ఏకాదశి నాటి రాత్రి
తొమ్మిది ఘడియల
పంతొమ్మిది విఘడియలకు
ఘడియా అయితే వేసేసుకుంటాం
వేసికుందురు గాని వేసికుందురు గాని
వేసుకోవడానికి వేరే ముహూర్తం ఉంది
ముహూర్తమా ములక్కాయ హ హ హ
ముహుర్తాలు చూసుకోము ముద్దు ముచ్చట్లు
మూడు ముళ్లు కోరుకోవు మూతి చప్పట్లు
అందమంతా అగ్గిమంట రాజుకుంటుంటే
లగ్గమంటూ ఆపమాకు love-u మీదుంటే
జడవను అసలే విడువను
జడవను అసలే విడువను
పెళ్లికి ముందే తొలిరేయంటా

నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Raj-koti
Lyrics powered by www.musixmatch.com

Link