Paadu Paadu

అన్యధా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన
రక్ష రక్ష మహేశ్వర

పాడు పాడు భారత మహిత కథ
(Wow how beautiful mm)
ప్రాణం దేహము మనకీ భూమి కదా
(O I like it I like it)
దేవతలు కొలువుండే దేశమే
ఈ దేశం
ఈ జన్మ భూమికి నా
స్వర్గమే సరిరాదు రాదు
పాడు పాడు భారత మహిత కథ
ప్రాణం దేహము మనకీ భూమి కదా

భాషలు పుట్టినదిక్కడనే
బంధం పెరిగినదిక్కడనే
సంస్కృతి వెలసినదిక్కడనే
సంస్కారం కలదిక్కడనే
అగ్ని పునీతను సీతను
నేటికి ఆరాధించేదిక్కడనే
వేద శాస్త్రములు భగవద్గీతలు
వెలుగులు కురిసినదిక్కడనే
ఎడడుగులకు ఏడు జన్మల
బంధం ఉన్నది ఇక్కడనే
కల్లోనైనా పసతినెపుడు తల్లిగ తలచేదిక్కడనే
తల్లిగ తలచేదిక్కడనే
పాడు పాడు భారత మహిత కథ
ప్రాణం దేహము మనకీ భూమి కదా

శిల్ప కళలున్నదిక్కడనే
చిత్ర లేఖనాలిక్కడనే
నాట్యం కులికినదిక్కడనే
నాధం పలికినదిక్కడనే
కాళిదాసుని వ్యాసుని నన్నయ
కవితలు పొంగినదిక్కడనే
ఋషివరేన్యులు జ్ఞాన భోదలతో
వేధం పంచినదిక్కడనే
విజ్ఞానంతో మొదలై ధర్మం
న్యాయం నడిచేదిక్కడనే
హృదయం తెరచి చూడవే మనకు
ఇంతటి స్వర్గం ఎక్కడని
ఇంతటి స్వర్గం ఎక్కడని
పాడు పాడు భారత మహిత కథ
ప్రాణం దేహము మనకీ భూమి కదా
దేవతలు కొలువుండే దేశమే
ఈ దేశం
ఈ జన్మ భూమికి నా
స్వర్గమే సరిరాదు రాదు
పాడు పాడు భారత మహిత కథ
ప్రాణం దేహము మనకీ భూమి కదా
అన్యధా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన
మళ్లీ ఒక జన్మం నాకంటూ ఉంటే
ఈ దేశంలోనే జన్మించే వరం ప్రసాదించు
రక్ష రక్ష మహేశ్వర



Credits
Writer(s): M Jayachandran, Lohithadas
Lyrics powered by www.musixmatch.com

Link