Chinna Chinna

చిన్న చిన్న చినుకుల్లోన
చిందే చిందే సిగ్గుల్లోన
నీలో మోగే నీటి వీణ
నాలో రేగే గాలి వాన

చినుకు శోభనం ముసురు మోహనం
నాలో నీలో తళుక్కుమంటే
ఓహో. మేఘం తళుక్కుమన్దా దేహం కలుక్కుమన్దా
వణుకు వందనం వయసు ఇంధనం
నీరే నిప్పై చురుకుమంటే
పెదవి తడారిన యెదల ఎడారిలో
వానే జల్లై చిటుక్కుమంటే
ఓడికి గడేసిన పడుచు గుడారమే
వంపో సొంపో కొరుక్కుతింటే
చెమ్మ చెక్క చెంగోయమ్మా
గోదారక్కా పొంగేనమ్మా
వయసు కులము వలపు మతము చలి చినుకుల చిటపటలకు కలిసిన ఒడిలో

చిన్న చిన్న చినుకుల్లోన
చిందే చిందే సిగ్గుల్లోన
నీలో మోగే నీటి వీణ
నాలో రేగే గాలి వాన
చిన్న చిన్న చినుకుల్లోనా...

చలికి జీవితం చెలికి స్వాగతం అన్నా విన్నా అలగకమ్మా
అలిగితే అందం రెట్తింపవుతుందంటా తెలుసా
పడుచు సోయగం తడిసి ఈ దినం వెడో వెచ్చో వదిలెనమ్మా
మెరుపు తరంగమై మేఘ మృదంగమై తాళం వేసే తాకిడిలో
చినుకు టపాలకె చిలక చిరాకుగా జాబే రాసే జాతరలో
వస్తే రావే వానాయమ్మా
దోస్తీ నాకూ వాడేనమ్మా
ఉలీకి పడిన మెరుపు వయసు తొలి ఉరుముల పులకరమిది కలిసిన తడిలో

చిన్న చిన్న .

చిన్న చిన్న చినుకుల్లోన
చిందే చిందే సిగ్గుల్లోన
నీలో మోగే నీటి వీణ
నాలో రేగే గాలి వాన

చిన్న చిన్న చినుకుల్లోనా...
చిందే చిందే సిగ్గుల్లోన
నీలో మోగే నీటి వీణ
నాలో రేగే గాలి వాన

చిన్న చిన్న .



Credits
Writer(s): Amma
Lyrics powered by www.musixmatch.com

Link