Vampulavykhari

ఒంపుల వైఖరీ సొంపుల వాకిలీ
ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ అల్లరి ఆకలీ
ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ మగతావినీ
ముడి వేయనీయవా
కాదనీ అనలేననీ గడి అయిన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ

ఒంపుల వైఖరీ సొంపుల వాకిలీ
ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ అల్లరి ఆకలీ
ఎందుకు పోకిరీ చాలు మరీ హో

మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే భద్నామి శుభకే
త్వం జీవ శరదస్యకం త్వం జీవ శరదస్యకం త్వం జీవ శరదస్యకం

లాలిలాలి లాలి లాలి లాలిలాలిలాలి లాలి లాలి లాలి

కాంక్షలో కైపు నిప్పూ ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం మరయాగ వాటికా
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా

హో హో ఆ ఆ హో హో

ఒంపుల వైఖరీసొంపుల వాకిలీ
ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీఅల్లరి ఆకలీ
ఎందుకు పోకిరీ చాలు మరీహో
నిష్ఠగా నిన్ను కోరీ నీయమమే దాటినా
కష్ఠమే సేద తీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరు గారే జ్వాలలో నింపినా
నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెత్తనా
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో

హో హో ఆ ఆ హో హో

ఒంపుల వైఖరీ సొంపుల వాకిలీ
ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ అల్లరి ఆకలీ
ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ మగతావినీ
ముడి వేయనీయవా
కాదనీ అనలేననీ గడి అయిన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ

ఒంపుల వైఖరీ సొంపుల వాకిలీ
ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ అల్లరి ఆకలీ
ఎందుకు పోకిరీ చాలు మరీ హో



Credits
Writer(s): Vennelakanti, Sirivennela Sitarama Sastry, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link