Edho Manasu

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో बोलो

రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి
మనువై మమతై మనదై పోయే
అనురాగాల ఫలమై

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఒక హృదయం పలికినది
జతకోరే జతులు శృతులు కలిపి
ఒక పరువం పిలిచినది ప్రేమించి
ఒక అందం మెరిసినది
ఎదలోన చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేధించి
తెలుసా ఏటి మనసా
పూల వయసేమంటుందో
తెలిసి చంటి మనసే
కంటి నలుసై పోతుందో
ఓ భామా రమ్మంటే
ఈ ప్రేమ బాధే సరి
మెడవిరి గడుసరి సరి సరిలే

ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో बोलो
ఒక మురిపం ముదిరినది
మొగమాటం మరిచి ఎదుట నిలిచి
ఒక అధరం వణికినది ఆశించి
ఒక మౌనం తెలిసినది
నిదురించే కలలు కనుల నిలిపి
ఒక రూపం అలిగినది వాదించి
బహుశా భావసరసాలన్నీ విరసాలౌను ఏమో
ఇక సాగించు జత సాదించు
మనసే ఉన్నదేమో
ఓ పాపా నిందిస్తే
ఆ పాపం నాదే మరి
విధి మరి విషమని మరి తెలిసే

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో बोलो
రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి
మనువై మమతై మనదై పోయే
అనురాగాల ఫలమే



Credits
Writer(s): Veturi Murthy, Koteswara Saluri
Lyrics powered by www.musixmatch.com

Link