Adiga Brahmani

నననా నానననా నానననా నాననా
నాననన నాననాన నననా
(తననం తననం తననం తననం)

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని తన మాటలే
ఋజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్లు నిన్ను విడననీ హోయ్
ఈ రేయి నేను కలగని
కలలో బ్రహ్మ పలుకులే
తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే నాక్కూడా తెలుసులే

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
మునుపటి జన్మలతో ముడిపడు పుణ్యములే
నీ నీడ నిన్ను చేర్చనీ
బతుకే నిండు పున్నమి
నా కంటిపాప నీవే నీ కంటి రెప్ప నేనే
ఏ నలుసులింక నేడు నిన్ను తాకలేవులే
కలిసిన మనసులలో కలతలు ఉండవులే
జతపడు హృదయములే జగములే మరుచునులే
నిజముగా కలకాదుగా
నిజమే నిజమే కలలాంటి నిజమిదే

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
చిరు చిరు సరసాలకు
మురిసిన సరదాలకు
కొరతలు లేని కాపురం
తెలియదు వేరుకావటం
నేనాడుకున్న పైరే ఏనాటికైన ఎదిగి
మన కొడుకులా రేపు
నీ కడుపు పండులే
గడిచిన గతమంత చేదుగా మిగిలేనే
కలిగిన చేదంతా తొలగునే ఇకపైనే
నిజముగా ఇది జరుగునా
నిజమే నిజమే నీ ఆశ తీరునే

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని తన మాటలే
ఋజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్లు నిన్ను విడననీ హోయ్
ఈ రేయి నేను కలగని
కలలో బ్రహ్మ పలుకులే
తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే నాక్కూడా తెలుసులే
(తననం తననం తననం తననం)



Credits
Writer(s): Srikanth Deva, Ananth Sriram
Lyrics powered by www.musixmatch.com

Link