Nenu Thaanani

ఓ హో హో..., హో హో హో... (2)

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడా మగ అని తేడా ఉందని
అభిమానానికి చెబుతారా
స్నేహము మొహం రెండు వేరని
తెలిసి తప్పుకుపోతారా...

ఓ హో హో..., హో హో హో...

ఒక చోటే ఉంటే ఒకటే కల కంటూ
విడి విడిగా కలిసే ఉండే కళ్లది ఏ బంధం
కలకాలం వెంటే నడవాలనుకుంటే
కాళ్ళకి ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం
చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో
ఏం లేకపోతే గూడు కడితే నేరమా
ఏ చెలిమి లేదా గట్టుతో ఏటికేదో
వివరించమంటే సాధ్యమా...

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడా మగ అని తేడా ఉందని
అభిమానానికి చెబుతారా
స్నేహము మొహం రెండు వేరని
తెలిసి తప్పుకుపోతారా...

కనులకు కనిపించే రూపం లేకుంటే
ప్రాణం తానున్నానన్నా నమ్మం అంటారా
చెవులకు వినిపించే సవ్వడి చేయందే
గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా
మధిలోని భావం మాటలో చెప్పకుంటే
అటువంటి మౌనం తగనిదంటూ అర్ధమా
తీరాన్ని నిత్యం అల అలా తాకుతుంటే
నిలిపే నిశేదం న్యాయమా...

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడా మగ అని తేడా ఉందని
అభిమానానికి చెబుతారా
స్నేహము మొహం రెండు వేరని
తెలిసి తప్పుకుపోతారా...

ఓ హో హో..., హో హో హో... (2)



Credits
Writer(s): Rahul Raj, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link