Neelo Unnadhi

నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే
మన జంటని అది అందుకే కలిపిందిలే
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా

సేద తీరితే ప్రియురాలి నీడలో
బాధలన్న మాటలింక చేరలేవులే
మాటలాడితే మనసైన వాడితో
మండుటెండ మంచు లాగా మారుతుందిలే
వలపుల మహిమకు
అడగని వరములు ఎదురుగ నిలిపెను
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా

ఊపిరుండగా నిను వీడిపోనని
ఆలయాన ఆన వేసి చూపుతానులే
ప్రేమ జంటని విడదీయరాదని
దేవుడైన గీత గీసి ఆపుతానులే
చరితలో మన కథ
నిజముగ నిలుచును యుగములు గడిచినా
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే
మన జంటని అది అందుకే కలిపిందిలే
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా
మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా



Credits
Writer(s): R.p. Patnaik, Kulashekhar
Lyrics powered by www.musixmatch.com

Link